జగిత్యాల:
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మాజీ మంత్రి హరీష్ రావు శనివారం చేరుకున్నారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యి కొంత సేపు చర్చలు జరిపారు. కాగా ఈ నెల 20న జగిత్యాలలో జరగ నున్న కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పర్యవేక్షిం చారు. ఈ సమావేశంలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

















