జగిత్యాలలో కేసీఆర్ సభకు ప్రజలే బలం 

0
  • ప్రభుత్వ వైఫల్యాలపై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్
  • మెడిగడ్డ, తమ్మిడేట్ పేరుతో డైవర్షన్ రాజకీయాలు.. 2028లో బిఆర్ ఎస్ విజయానికి ఇదే నాంది..

జగిత్యాల:

జగిత్యాలలో రేపు(20న) జరగనున్న కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్ల నేపథ్యంలో ఆదివారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి (PALLA RAJESWER REDDY )కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగిత్యాల ప్రజలకు రాజకీయ చైతన్యం ఉంది. మీటింగ్ పెడితే స్వచ్ఛం దంగా వచ్చి వినే సంస్కృతి ఈ ప్రాంతంలోనే ఉందన్నారు. గత 48 ఏళ్ల క్రితం జగిత్యా లలో జైత్యయాత్ర పేరుతో వామ పక్షాల ఆధ్వర్యంలో ఊర్రూ తలూగిన ఉద్యమ కార్యక్రమా లు జరిగాయని గుర్తు చేశారు. 2023 నుంచి ఇప్పటివరకు రెండున్నరేళ్ల పాలనలో ప్రభుత్వం బడ్జెట్‌ను పెంచలేకపో యిందని ప్రశ్నించారు. అప్పులు పెంచడమే తప్ప ఒక్క నిర్మాణాత్మక పని కూడా చేయలేదని విమర్శించారు. ఇన్నా ళ్లు పనికిరాదని చెప్పిన మెడిగడ్డ వద్ద ఇప్పుడు హఠాత్తుగా పనులు మొదలుపెడుతున్నారన్నారు.రెండున్నరేళ్లుగా చెప్పిన మాటలన్నీ కాళ్లబుల్లా మాటలేనా అని నిలదీశారు.

తమ్మిడేట్ ప్రాజెక్ట్‌ కోసం చిన్న డ్రాయింగ్ కూడా లేదు:

తమ్మిడేట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నామని చెబుతున్నా, దాని కి సంబంధించిన చిన్న డ్రాయింగ్ కూడా లేదని పల్లా ఎద్దేవా చేశారు. తమ్మిడేట్‌ను ప్రారంభించే శక్తి ప్రభుత్వానికి లేదు. మెడిగడ్డను ఆపే సామర్థ్యం కూడా లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ సభను డైవర్ట్ చేయడానికే రేపే మెడిగడ్డ కార్యక్రమా న్ని పెట్టారని ఆరోపించారు. అదే రోజు మీటింగ్ పెట్టడమే మా తొలి విజయం. మేం సభ పెడితే అదే రోజు కార్యక్రమా లు పెట్టడం తప్ప వారికి వేరే దారి లేదని వ్యాఖ్యానించారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సభలు నిర్వహిస్తూ ప్రజల సొమ్మును వృథా చేస్తున్నారని విమర్శించారు. తాము అలా చేయడం లేదు. ప్రజలు స్వచ్ఛందంగా సభలకు వస్తున్నారని స్పష్టం చేశారు. మెడిగడ్డకు తీసుకువచ్చింది ఈ కలయికేన ని పేర్కొన్నారు. జగిత్యాల జైత్యయాత్ర ముందుకు సాగు తుందని, 2028 ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇదే నాంది ప్రస్తావన అవుతుందని అన్నారు.సాగు నీటి కోసం ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా ప్రారంభించలేదు. ఇప్పటికే కొనసా గుతున్న ప్రాజెక్టుల్లో పనిచేసే వారిని కూడా కొనసాగించలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలయ్యే స్థితికి చేరిందన్నారు.

బడ్జెట్ పెంచుకునే శక్తి ప్రభుత్వానికి లేదు:

బడ్జెట్ పెంచుకునే శక్తి ప్రభుత్వానికి లేదని ఎమ్మెల్యే పల్లా అన్నారు. ఒకవైపు రియల్ ఎస్టేట్ కుప్పకూలగా, మిగతా వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయని చెప్పారు. రాష్ట్రం మొత్తం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని ప్రజలు ఇబ్బందులు పడు తున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభు త్వం తప్పుకోవాలని, కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని నినాదం జగిత్యాల నుంచే మొదలవుతుందని తెలి పారు.ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి, బీఆర్‌ఎస్‌ను కేసీఆర్ నాయక త్వంలో తిరిగి అధికారంలోకి తీసుకురావ డం ఖాయమని డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here