- న్యాయం జరిగేలా ఒత్తిడి తీసుకువస్తాను
జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి హామీ
చేర్యాల:
చేర్యాల పట్టణ కేంద్రంలో గురువారం ఆశా వర్కర్లు(ASHA WORKERS )ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందచేశారు. ఈ సందర్బం గా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ లైన నెలకు రూ.18,000 కనీస వేతనం, ఉద్యో గ భద్రత అమల య్యేలా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లి కృషి చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే పల్లా ఆశా వర్కర్ల సమస్యలపై సానుకూలంగా స్పందించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశా న్ని ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. అనంత రం ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్తాను..వారికి న్యాయం జరిగేలా ఒత్తిడి తీసుకువస్తా నని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

















