15.2 C
London
Monday, June 1, 2026
Home పార్టీ కార్యక్రమాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ బలోపేతంపై కేటీఆర్ దిశానిర్దేశం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ బలోపేతంపై కేటీఆర్ దిశానిర్దేశం

0
  • నియోజకవర్గాల వారీగా పార్టీ స్థితిగతుల సమీక్ష
  • సమావేశంలో పాల్గొన్న జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

హైదరాబాద్: హైదరాబాద్ లోఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వ కుంట్ల తారక రామారావు(BRS Working presedent KTR)మంగళవారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ బలోపేతంపై కేటీఆర్ నేతలకు స్పష్ట మైన దిశానిర్దేశం ఇచ్చారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డులో బీఆ ర్ఎస్ పార్టీని మరింతగా బలపర్చాలని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. త్వరలో జరగనున్న వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టు కుని అను సరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. ఎన్ని కల్లో గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పని చేయాలని కేటీ ఆర్ నేతలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లా లోని ప్రతి నియోజకవర్గం వారీగా పార్టీ స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. స్థానిక పరిస్థితులను బట్టి కార్యాచర ణను రూపొందించుకోవాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో పార్టీ పోషించాల్సిన పాత్రపై కూడా చర్చ జరిగింది. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో చురు కుగా పాల్గొని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిం చేందుకు కృషి చేయాలని కేటీఆర్ సూచించారు. ఈ సమా వేశంలో పలువురు జిల్లా, నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here