- భక్తి వాతావరణంలో ఘనంగా విజయదుర్గాదేవి ప్రతిష్ట మహోత్సవం
- ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
చేర్యాల: చేర్యాల మండలం కడవేరుగు గ్రామంలో విజయ దుర్గాదేవి (Vijaya Durga Devi)సహిత నాభిశీల (బొడ్రాయి)ప్రతిష్ట మహోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్య క్రమంలో జనగామ ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరైయ్యారు.ఈ సందర్బం గా గ్రామస్తులు, భక్తులతో కలిసి దేవి ప్రతిష్టా మహోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించా రు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ విజయ దుర్గాదేవి ఆశీస్సులతో కడవేరుగు గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. ప్రతి ఇంటిలో సుఖశాంతులు నెలకొనాలి. ప్రజ లకు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.

















