13.6 C
London
Monday, June 1, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ చేర్యాలలో వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే పల్లా 

చేర్యాలలో వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే పల్లా 

0
  • నూతన వధూవరులకు ఆశీర్వాదం

చేర్యాల: చేర్యాల పట్టణంలో బుధవారం జరిగిన పలు వివాహ వేడుకలకు(All marriege programs)జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

చేర్యాల పట్టణ కేంద్రంలోని వీరభద్ర గార్డెన్‌లో నిర్వహించిన వివాహ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి ముచ్చంతల సుక్కారెడ్డి వినోద దంపతుల కుమారుడు నవీన్ రెడ్డి, శిరీష రెడ్డి వివాహానికి ఎమ్మెల్యే హాజరై ఆశీస్సులు అందించారు.

అదే విధంగా షణ్ముఖ గార్డెన్‌లో జరిగిన వివాహ వేడుకలో మర్మాముల గ్రామానికి చెందిన జంగిలి యాదగిరి కుమార్తె అమూల్య, నవీన్ వివాహా నికి హాజరై దంపతులను అభినందించారు.

జిఎన్ఆర్ గార్డెన్‌లో జరిగిన వివాహంలో కొత్త దొమ్మాట గ్రామానికి చెందిన శెట్టి అంజయ్య కుమార్తె సాత్విక, రమేష్ వివాహానికి ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను హృదయపూర్వక ఆశీర్వాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లా డుతూ…నూతన వధూవరులు సుఖశాంతులతో, ఆనందం గా జీవించాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి కొంతసేపు గడిపి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here