జనగామ: జనగామ జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్స్ లో బుధవారం జరిగిన వివాహ వేడుకకు జనగామ మాజీ ఎంపీపీ బైరాగిని యాదగిరి మనవడి వివాహానికి ముఖ్య అతిథిగా జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి(Janagama Mla Palla)హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వ దించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

అలాగే జనగామ పట్టణ కేంద్రంలోని సత్యసాయి గార్డెన్స్‌లో జరిగిన ఆలేటి సిద్దిరాములు కుమారుడి వివాహ వేడుకలో ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ వేడుకలో వధూవరులను ఆశీర్వదించి, వారి భవిష్యత్తు సుఖశాంతులతో నిండాలని ఆకాంక్షించారు.

















