17.4 C
London
Thursday, July 16, 2026
Home వ్యవసాయం జేబులో డబ్బు ఉంటేనే ధాన్యం కొనుగోలు…!

జేబులో డబ్బు ఉంటేనే ధాన్యం కొనుగోలు…!

0
  • లేకపోతే రైతుకు న్యాయం లేదా?
  • కెసిఆర్ లాంటి అన్నదాతకు అండగా నిలిచిన నాయకుడిని కోల్పోయామా…? రైతు గుండె ముక్కలైన ఆవేదన
  • వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో ఎమ్మెల్యే డాక్టర్ పల్లాతో రైతు చేరాలు కన్నీటి గాథ

వరంగల్:

వరంగల్ ఏనుమాముల మార్కెట్ (Warangal Enumamula Market) యార్డ్ లోని కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎదుర్కుంటున్న ఇబ్బందుల గురించి ఉమ్మడి వరం గల్ జిల్లా మాజీ శాసన సభ్యులతో కలిసి జనగామ ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి సోమవారం ధర్నా చేస్తూ రైతుల తరఫున నిరసన తెలిపారు.

ఈ సందర్బంగా వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో చేరాలు అనే ఓ రైతు తన ఆవేదనను జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డితో కన్నీటి గాథగా పంచుకున్నాడు.

“జేబులో చేయి పెడితేనే కొనుగోలు జరుగుతుందంటారు…లేకపోతే మా ధాన్యం ఎవరూ పట్టించుకోవడం లేదు సార్. డంప్ దగ్గరికి వెళ్దామంటే ఇక్కడ కాదు..అక్కడ కూర్చోండి అని తిరస్కరిస్తున్నారు. మా ముఖం కూడా చూడడం లేదు. 5 వేల రూపాయలు ఇచ్చిన వాడి దగ్గరకే ముందుగా వెళ్లి కొనుగోలు చేస్తున్నారు.

ఇక్కడ పైసల దోపిడీ బహిరంగంగా జరుగుతోంది సార్…డబ్బు లేనోడికి ఇక్కడ న్యాయం లేదు. అన్నం పెట్టిన రైతుని ఇంతలా మోసం చేస్తారా? అంటూ చేరాలు గుండె పగిలేలా తన బాధను వ్యక్తం చేశాడు.

మేము కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికే ఇన్ని అవమా నాలు పడాల్సి వస్తోంది. మా దేవుడు లాంటి కే. చంద్రశేఖర్ రావు సార్ మాకు అన్నం పెట్టేవాడు..ఈరోజు అన్నం పెట్టొటోనికి సున్నం పెట్టాం సార్…అందుకే ఈరోజు ఈ పరిస్థితి అనుభవిస్తున్నామంటూ అతని మాటల్లో ఆవేదన స్పష్టంగా కనిపించింది.

రైతు మాటలు విన్న ఎమ్మెల్యే డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి భావో ద్వేగానికి గురయ్యారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తాం..బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పు  డూ రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనం తరం ఆయన కే. చంద్రశేఖర్ రావు, కేటీఆర్ దృష్టికి ఈ సమ స్యలను తీసుకెళ్తామని తెలిపారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here