15.2 C
London
Monday, June 1, 2026
Home పార్టీ కార్యక్రమాలు 2013 నుంచి జలమండలిలో గులాబీ జెండాదే విజయం

2013 నుంచి జలమండలిలో గులాబీ జెండాదే విజయం

0
  • జలమండలిలో ఉద్యోగుల సంక్షేమమే బీఆర్‌ఎస్ ధ్యేయం
  • ఉద్యోగుల సంక్షేమానికి బీఆర్‌ఎస్ హయాంలో కీలక నిర్ణయాలు
  • ఎన్‌ఎమ్‌ఆర్ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చర్యలు
  • ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి 61సంవత్సరాలకు పెంపు
  • రెండు దఫాల్లో 73 శాతం పీఆర్‌సీ అమలుకు కృషి చేశాం.
  • కార్మికుల కోసం హెల్త్ కార్డుల సౌకర్యం కల్పించాం.
  • బాణం గుర్తు గెలిపిస్తే పెండింగ్ సమస్యల పరిష్కారంకు కృషి చేస్తాం.
  • పెండింగ్ డిఏ బకాయిలు, కొత్త పీఆర్‌సీ అమలుకు కృషి చేస్తాం.
  • ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ భరోసా
  • ఎన్‌పీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ కోసం పోరాటం చేస్తాం.
  •  ఉద్యోగుల భవిష్యత్తు కోసం బాణం గుర్తుకే మద్దతు ఇవ్వండి 
  • కాముగాన్ యూనియన్ బాణం గుర్తును గెలిపించి ఉద్యోగుల హక్కులను కాపాడుకుందాం
  • బీఆర్‌టీయూ ఆధ్వర్యంలో జలమండలి ఉద్యోగుల విస్తృత స్థాయి సమావేశం

               ముఖ్యఅతిధిగా హాజరైన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి 

హైదరాబాద్:

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు(HMWS&SB)గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లో మంగళవారం జనగామ ఎమ్మెల్యే పల్లా నివాసంలో భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (BRTU) ఆధ్వర్యంలో జలమండలి ఉద్యోగుల విస్తృత స్థాయి సమావేశం జరిగిం ది. ఈ సమావేశానికి బీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబు యాదవ్ అధ్యక్షత వహిం చగా, ముఖ్య అతిథిగా యూనియన్ గౌరవ అధ్యక్షులు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొని కార్మిక ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ:

  • గత 13 ఏళ్లుగా జలమండలి కార్మికులు గులాబీ జెండాను తమ గుండెల్లో పెట్టుకున్నారని గుర్తుచేశారు.
  • గత ప్రభుత్వ హయాంలో జరిగిన రెండు గుర్తింపు సంఘం ఎన్నిక ల్లో విజయం సాధించి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశామని తెలిపారు.
  • ఎన్‌ఎమ్‌ఆర్ కార్మికుల సమస్యలను నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మంత్రి టి హరీష్ రావు సహకారంతో పరిష్కరించా మని పేర్కొన్నారు.
  • ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని 61 సంవత్స రాలకు పెంచడం ద్వారా జలమండలి సిబ్బందికి ప్రయోజనం కలిగింద న్నారు.
  • అలాగే రెండు దఫాలుగా దాదాపు 73 శాతం పీఆర్‌సీ అమలు చేసి ఉద్యోగుల ఆర్థిక భద్రతకు కృషి చేశామని తెలిపారు.
  • కార్మికుల ఆరోగ్య రక్షణ కోసం హెల్త్ కార్డుల సౌకర్యం తీసుకువచ్చా మని గుర్తుచేశారు.
  • రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ‘బాణం’ గుర్తుపై జి. రాంబాబు యాదవ్ పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
  • తెలంగాణ ఉద్యమం నుంచే బాణం గుర్తు కార్మిక హక్కుల ప్రతీకగా నిలిచిందన్నారు.
  • బాణం గుర్తును గెలిపిస్తే కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమ బద్ధీకరిస్తామని, సిబ్బంది కొరత నివారణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
  • కొత్త పీఆర్‌సీ అమలు, పెండింగ్‌లో ఉన్న టీఏ బకాయిల చెల్లింపు, ప్రతి ఉద్యోగి కుటుంబానికి రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, ఎన్‌పీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ కల్పన కోసం పోరాడతామని తెలిపారు.
  • ప్రస్తుత ప్రభుత్వంపై పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. గుర్తింపు సంఘం ఎన్నికల ప్రకటనను రాజకీయంగా ప్రచారం చేసుకుం టున్నారని, కానీ ఉద్యోగుల ప్రాథమిక సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపించారు.
  • జలమండలిలో ఉన్న సిబ్బంది కొరత, కొత్త నియామకాల లేమి, ఉద్యోగుల విభజన సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
  • జలమండలి గుర్తింపు సంఘం ఎన్నికలు ఉద్యోగుల భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టమని పేర్కొన్నారు.
  • అనుభవం ఉన్న నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంద న్నారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరా డుతున్న కముగాన్ యూనియన్ బాణం గుర్తుకే ఉద్యోగు లంతా ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here