- ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం
- జనగామలోనే అత్యధిక సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
- నీలిమ హాస్పిటల్ ద్వారా వేలాదిమందికి ఉచిత వైద్య సేవలు
- నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి వెనుకడుగు లేదు
- ఆరోగ్య సమస్యలుంటే ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించండి
- అవసరమైతే నీలిమ హాస్పిటల్ సేవలు వినియోగించుకోండి
- చేర్యాలలో లబ్ధిదారులకు రూ.11.66 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి
చేర్యాల:
పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. చేర్యాల పట్టణ కేంద్రంలోని రేణుక గార్డెన్లో మంగళవారం నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ (CMRF CHECKS )కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి గా హాజరయ్యారు. చేర్యాల పట్టణంతో పాటు చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూలిమిట్ట మండలాలకు చెందిన లబ్ధిదారులకు రూ.11 లక్షల 66 వేల విలువైన 55 సీఎం ఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ…
- రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన నియోజకవర్గం జనగామే..
- ప్రజలకు అవసరమైన సమయంలో ఆర్థిక సహాయం అందిం చేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగ పడుతోంది.
- గ్రామీణ ప్రాంత ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ముందుగా ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించాలని సూచించారు.
- అవసరమైన పరిస్థితుల్లో తమ నీలిమ హాస్పిటల్ సేవలను కూడా వినియోగించుకోవచ్చు.
- డిసెంబర్ 2023 నుంచి నీలిమ హాస్పిటల్ ద్వారా వేలాది మంది నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తు న్నాం.
- జనగామ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయం లో ఎలాంటి రాజీ ఉండదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
- ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబా టులో ఉంటూ, ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు చేరేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తాను.

















