- వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది
- గన్నీ బ్యాగులు లేవు.. లారీలు లేవు.. రైతుకు దిక్కులేని దుస్థితి
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపుకు కుట్ర జరుగు తోంది..వారి కుట్రలను తిప్పికొట్టాలి..!
- ఎన్నికల సంఘం బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారింది
- అర్హుల ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత కార్యకర్తలదే
- సభ్యత్వ నమోదును ఉద్యమంలా విజయవంతం చేయాలి.
- రైతుల పక్షాన నిరంతరం బీఆర్ఎస్ పోరాటం కొనసాగు తుంది
- చేర్యాలలో నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి దిశానిర్దేశం
చేర్యాల:
చేర్యాల పట్టణ కేంద్రంలోని రేణుక గార్డెన్లో మంగళవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల సమావేశంలో(Meeting of BRS party workers and leaders) జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైతాంగ సమస్యలు, కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనున్న ఎస్ఐఆర్ ప్రక్రియ, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం తదితర అంశాలపై కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు.
జనగామ ఎమ్మెల్యే పల్లా పాయింట్స్:
- గత రెండు నెలలుగా రాష్ట్రంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.
- వడ్ల కొనుగోలు ప్రక్రియలో గన్నీ బ్యాగుల కొరత, ధాన్యం తరలిం పునకు లారీల లభ్యత లేకపోవడం వంటి సమస్య లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
- లారీలు అందుబాటులో లేక రైతులు సొంతంగా ట్రాక్టర్లలో ధాన్యాన్ని తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
- గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని, కాంగ్రెస్ పాలనలో రైతాంగాన్ని అగచాట్లకు గురిచేస్తున్నారని విమర్శించారు.
- రైతుల సమస్యల పరిష్కారం కోసం పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు నిరంతరం అధికారులతో సమన్వయం చేసు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- చేర్యాల ప్రాంతంలోని రైస్ మిల్లులు వడ్లు తీసుకోకపోవడం తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు.
- కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాగు నీరు, 24 గంటల ఉచిత విద్యుత్, సకాలంలో యూరియా, విత్తనాల సరఫరాకు ప్రాధాన్యం ఇచ్చామని గుర్తు చేశారు.
- వానాకాలానికి ముందే ఎత్తిపోతల పథకాల మరమ్మతులు, కాలువల పునరుద్ధరణ పనులు చేపట్టి రైతులకు అండగా నిలిచామని తెలిపారు.
- పంట చేతికొచ్చిన తర్వాత కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందు లు లేకుండా ధాన్యం సేకరణ చేపట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు.
- కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా చేర్యాల ప్రాంతంలో గులాబీ జెండా ఎగిరిందని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది.
- జూన్ 25 నుంచి చేపట్టనున్న ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ పేరుతో ఓట్ల తొలగింపుకు పెద్ద కుట్ర జరు గుతోందని ఆరోపించారు.
- ఎన్నికల సంఘం బీజేపీ చేతిలో పావుగా మారిందని, బీజే పీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఓట్ల తొలగింపు ప్రక్రియ సాగుతోందని విమర్శించారు.
- ముస్లింలు, వలస కార్మికులు, గ్రామాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న పట్టణ వాసుల ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించి తొలగిం పు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
- ఈ డిజిటల్ విధానంలో జరిగే ప్రక్రియపై పార్టీ నాయకులు, కార్యక ర్తలు అప్రమత్తంగా ఉండి అర్హులైన ఓటర్ల హక్కుల ను కాపాడాలని సూచించారు.
- ప్రతి బూత్‌లో ఇద్దరు చొప్పున క్రియాశీలక కార్యకర్తలను గుర్తించి వారికి సభ్యత్వ నమోదు, ఓటర్ల జాబితా పరిశీల నపై పూర్తిస్థాయి శిక్షణ అందిస్తామని తెలిపారు.
- అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని స్పష్టం చేశారు.
- రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
- పార్టీపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరినీ సభ్యత్వ నమోదు కార్యక్ర మంలో భాగస్వాములను చేసి ఉద్యమంలా విజయవంతం చేయాలని కోరారు.
- బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్య కర్తలకు సూచించారు.

















