- ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి?
- అసెంబ్లీలోనూ ఉద్యోగ నోటిఫికేషన్లపై గళమెత్తినం.
- ఉద్యోగాలపై యువత ఆశలతో ప్రభుత్వం ఆటలాడుతోంది
- నోటిఫికేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మోసం చేస్తోంది
- కేసీఆర్ హయాంలో 1.62 లక్షల ఉద్యోగాలు భర్తీ..
- ఈ ప్రభుత్వం 12 వేల ఉద్యోగాలే ఇచ్చింది..
- యువత ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లుతుంది
- ఉద్యోగార్థులకు డిజిటల్ వేదికగా రాకేష్ రెడ్డి e-Classroom యాప్
- చదువు, జ్ఞానమే యువతకు అసలైన శక్తి…
- నాడు టీచర్ ఒక్కరే సోర్స్..నేడు సమాచారం చేతిలోకి వచ్చింది
- సాంకేతికతను ఉపయోగించుకుని లక్ష్యాలను చేరుకోవాలి
- ప్రభుత్వ ఖాళీల భర్తీ కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉంది
- రాకేష్ రెడ్డి గారి సేవలు నిరుద్యోగులకు ఆదర్శం
- e-Classroom యాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

హన్మకొండ :
తెలంగాణలో 50 వేల మెగా డీఎస్సీ ఉద్యోగాలంటూ గతం లో నిరుద్యోగులకు హామీలు ఇచ్చారని, ఆ పోస్టులు ఏమ య్యాయి. తాము అధికారంలోకి వస్తే ఏటా 2 లక్షల ఉద్యో గాలు ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్, రెండున్నరేళ్లు గడుస్తున్నా కనీసం 20 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపో యిందని కాంగ్రెస్ ప్రభుత్వం పై జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(JANAGAMA MLA PALLA RAJES WER REDDY) మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఒకే సారి 16 వేలు, 17 వేల చొప్పున భారీగా నోటిఫికేషన్లు పోలీ స్ శాఖలో ఇచ్చామని, కేవలం పోలీస్ శాఖలోనే దాదాపు 48 వేల పోస్టులు భర్తీ చేసామని ఆయన గుర్తుచేశారు. గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందిం చిన రాకేష్ రెడ్డి(e-Classroom )మొబైల్ యాప్‌ను అంబే డ్కర్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఎమ్మెల్యే పల్లా మీడియా పాయింట్స్:
- రాకేష్ రెడ్డి తనకున్న ఉన్నత చదువు, జ్ఞానంతో ఉద్యోగ అభ్య ర్థులకు సహాయం చేయాలనే ఆలోచనతో ఈ డిజిటల్ యుగంలో ఇంట్లోనే ఉండి చేతిలో చదువుకోవడానికి వీలు గా సమాచారాన్ని ఈ యాప్‌లో పొందుపరిచారు. ఇందుకు సహకరించిన చక్రవర్తి గారికి, రాకేష్ రెడ్డికి అభినందనలు. విద్యార్థులంతా ఈ యాప్‌ను ఉప యోగించుకుని వారి పేరు గుర్తుపెట్టుకోవాలి.
- తాను 40 ఏళ్ల క్రితం సోడాశపల్లి అనే చిన్న గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాను. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకు న్నానని గుర్తుచేసుకున్నారు.
- ఆ రోజుల్లో విద్యార్థులకు ఉన్న ఏకైక సోర్స్ టీచర్ మాత్రమే. టీచర్ ఏం చెప్తే అదే విద్య, దానిపై ఎలాంటి డిస్కషన్ ఉండే ది కాదు. లైబ్రరీ లలో పుస్తకాలు, సమాచారం, మెటీరియల్ చాలా తక్కువగా ఉండేవి. అప్పట్లో అద్భుతమైన టీచర్లు ఉండేవారు.
- ఈనాడు ఉన్న కార్పొరేట్ శక్తులు ఒకే పేరుతో ఇంటర్మీడియ ట్ లోనే టీచర్లను విడగొట్టారు. టీచర్ యొక్క గుర్తింపును ఈ కార్పొరేట్ శక్తులు తీసేశాయి.
- టీచర్ ఏం చెప్తున్నారనే దానికంటే టీచర్ల దగ్గర నుంచి పిల్ల లు ఏం నేర్చుకున్నారనేది ముఖ్యం. నాడు టీచర్ చెప్తే వేదం గా భావించేవారు, కానీ నేడు టీచర్లు క్లాస్‌కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.
- నాడు టీచర్ మాత్రమే సోర్స్ కాగా…నేడు రాకేష్ రెడ్డి ఇన్ఫ ర్మేషన్ మొత్తాన్ని ఒక పూసలాగా గుచ్చి విద్యార్థుల చేతుల్లోకి తీసుకువచ్చారు.
- మనకు చదువు, జ్ఞానం ఉంటేనే సమాజంలో విలువ ఉంటుంది. సబ్జెక్టు, నాలెడ్జ్ ఉంటే మీకు ఏ ఎమ్మెల్యే, ఎమ్మె ల్సీల అవసరం లేదు. సబ్జెక్టు, లాంగ్వేజ్ రెండూ ప్రెసెంట్ చేయగలిగితే ఏ ఉద్యోగమైనా కొట్టొచ్చు. చదువుకునే సమయంలోనే కష్టపడి చదువుకోవాలి.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఐటీ ఉద్యోగాలు, అనేక ప్రైవేట్ పరిశ్ర మలలో ఉద్యోగాలు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కచ్చితంగా కొట్లాడుదాం. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో ఖాళీలను నింపడం మన హక్కు, వాటి కోసం పోరాడుదాం.
- గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వ లేదని కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు మాట్లాడింది. తాను రెండు సార్లు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వరంగల్‌లోని అనేక యూని వర్సిటీలు, కాలేజీలకు వెళ్లి మాట్లాడాను.
- ఏ రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా వారి ఆర్థిక పరిస్థితి, అవస రాన్ని బట్టి ప్రభుత్వ ఉద్యోగాలు జనాభాలో కేవలం 1శాతం నుండి శాతం లోపే ఉంటాయి. ఇవి ప్రజలకు సేవలు అందేం దుకే ఉంటాయి. గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదనడం పచ్చి అబద్ధం.
- తాను 9 ఏళ్లు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అనేకమంది నిరు ద్యోగ సంఘాల మిత్రులు తన దగ్గరికి వస్తే, వారిని మంత్రుల దగ్గరకు, సీఎం దగ్గరకు తీసుకువెళ్లి నోటిఫికేషన్లు ఇప్పించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
- గత ప్రభుత్వం మూడు సార్లు నోటిఫికేషన్లు ఇచ్చి 47వేల అని పేర్కొన్నారు. పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేసింది. వయ సు పెంపు, రన్నింగ్ పోటీ పరీక్షల ఇబ్బందులను తొలగించి నిరుద్యోగులకు మేలు చేయడంలో ముందున్నాం.
- ప్రస్తుతం పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో 20 వేల ఉద్యోగాలు ఖాళీ గా ఉంటే, ఈ ప్రభుత్వం కేవలం 4 లేదా 5 వేలు మాత్రమే ఎందుకు ఇస్తోందని ప్రశ్నిస్తున్నాను..
- యువత రెండేళ్లగా రాత్రింబగళ్లు కష్టపడి ఉద్యోగం వస్తుం దనే ధీమాతో ప్రిపేర్ అవుతుంటే, వారిపై నీళ్లు చల్లినట్లు ఈ తక్కువ పోస్టులు ఇవ్వడం ఏంటి?
- 2014 తర్వాత ప్రతి పోలీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది, పరీక్షలు నిర్వహించింది, రిజల్ట్స్ ఇచ్చింది అంతా కేసీఆర్ ప్రభుత్వమే. చిన్న చిన్న లోపాల వల్ల ఆగిపోయిన ఆ రిక్రూట్‌మెంట్‌కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం నియా మక పత్రాలు (పట్టాలు) ఇచ్చింది తప్ప, కొత్తగా ఒక్క పోలీస్ ఉద్యోగం కూడా ఇవ్వలేదు.
- తండాలు, గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి వస్తే ‘మెగా డీఎస్సీ’ ఇస్తామని, ఒకేసారి 50 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.
- ఉద్యోగాలు ఇవ్వట్లేదని ఒక అమ్మాయి ఓటు వేయనని కూడా చెప్పిం ది. కానీ అధికారంలోకి వచ్చాక డీఎస్సీ పేరు చెప్పి మోసం చేశారు. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 8 వేల టీచర్ల ఉద్యోగాలను ఫిల్ అప్ చేశాం.
- తెలంగాణలో వెయ్యికి పైగా గురుకులాలు ఓపెన్ చేసి, వాటికి 25 వేల ఉద్యోగాలు అవసరమైతే 2014 నుండి 2023 వరకు గత ప్రభుత్వం 12 వేల గురుకుల ఉద్యో గాలను (ఎస్సీ, ఎస్టీ) నింపింది. ఇంకో 6 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నాం. మార్చి తర్వాత మరో 4 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్తే నమ్మలేదు.
- రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక గతంలోని 6 వేల ఉద్యోగాల నోటి ఫికేషన్‌ను క్యాన్సిల్ చేసి, దానికి కేవలం 5 వేలు యాడ్ చేసి మొత్తం 11 వేలు మాత్రమే ఇచ్చారు. 50 వేల డీఎస్సీ ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారు.
- మొన్న అసెంబ్లీలో మేము జాబ్ క్యాలెండర్ గురించి అడి గాం. మ్యానిఫెస్టోలో చెప్పినట్లు ఏ ఏ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఏ నెలలో నోటిఫికేషన్ ఇస్తారు, ఏ నెలలో రిజ ల్ట్స్ ఇస్తారు, ఏ నెలలో ఆర్డ ర్స్ ఇస్తారో మెన్షన్ చేయాల న్నాం. మేము అమరుల స్తూపం వద్దకు వెళ్తుంటే పేపర్లు గుంజుకున్నారు, అసెంబ్లీ ముందు బైఠాయించి వెంటపడి తే.. చివరకు ఖాళీలు, డేట్లు ఏవీ లేకుండా కేవలం ఒక నల్ల కాగితం మీద రాసి తూతూమంత్రంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చారు.
- మొన్న సీఎం అసెంబ్లీ వేదికగా 50 వేల ఉద్యోగాలు ఇచ్చా మని చెప్తే మేము ప్రశ్నించాం. 2023 తర్వాత ఎన్ని ఉద్యో గాలు ఇచ్చారని అడి గితే కేవలం 12 వేల ఉద్యోగాలకే ఇచ్చామని ఒప్పుకున్నారు. నిరుద్యోగులను నిత్యం మోసం చేస్తున్నారు.
- దిల్ సుఖ్ నగర్, అశోక్ నగర్, వరంగల్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎంతో మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.
- నిరుద్యోగుల కోసం అసెంబ్లీ లోపల మేము, అసెంబ్లీ బయ ట మా విద్యార్థి విభాగంతో పాటు రాకేష్ రెడ్డి ఆనాటి నుంచి ఈనాటి వరకు నిర్భయంగా కొట్లాడుతున్నారు. రాజకీ యంలో ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. నిరుద్యో గులకు పైసలు కావాలన్నా..వారి తరఫున నిలబడాలన్నా రాకేష్ రెడ్డి ముందుంటున్నారు.
- 2014 నుండి 2023 వరకు కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యో గాలు 1.62 లక్షలు. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చింది కేవలం 12 వేల ఉద్యోగాలు మాత్ర మే, అవి కూడా గత ప్రభుత్వం ఇచ్చి న నోటిఫికేషన్లే తప్ప కొత్తవి కావు.
- గత ప్రభుత్వంలో ఉన్న ఒకే ఒక్క మిస్టేక్ గ్రూప్-1 పేపర్ లీక్ కావడం. ఆ లీకేజీతో బాధ్యత ఉన్నా లేకున్నా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను తొలగించాలని అందరం కోరినాం.
- ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడి చెప్పారు. కానీ మొన్న బీజేపీ ఎంపీలు, మంత్రులు మాట్లాడుతూ.. ఉద్యోగా లతో పాటు ఉపాధి కూడా కల్పిస్తున్నామని, ఆ ఉద్యోగాల కింద ఉపాధిని కూడా లెక్కేసుకోమని చెప్పడం చాలా దురదృష్టకరం. యువత ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకోవడం లో తప్పు లేదు.
- ఐటీ రంగంలో తెలంగాణ, తెలుగు ప్రజలు యూఎస్ఏలో నూ, ఇక్కడా సంపాదిస్తున్నారు. గత ప్రభుత్వం 2014లో 3 లక్షల ఐటీ ఉద్యోగాలతో ప్రయాణం మొదలుపెట్టి 2023 నాటికి వాటిని 10 లక్షలకు పెంచింది. కానీ ఈ మూడేళ్లలో ఒక్క ఐటీ ఉద్యోగం కూడా రావడం లేదు..ఉన్న చిన్న చిన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతున్నాయి. యూనివర్సిటీల్లో కొత్తగా ఎలాంటి కోర్సులు ప్రవేశపెట్టలేదు.
- కాకతీయ యూనివర్సిటీ లో పలువురు ఉద్యోగాలు పర్మ నెంట్ చేయాలని అడుగు తున్నారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం టెంపరరీ పేరు మీదున్న 1020 మంది ఉద్యోగు లను పర్మనెంట్ చేయాలని జీవో తీసుకొస్తే..ఆర్జేఏసీ (ఆరోగ్య సంస్థ/నిరుద్యోగ సంస్థ) కోర్టుకు వెళ్లి అడ్డుపడింది. ఆనాటి నుండి ఈనాటి వరకు దాన్ని అడ్డుకున్నారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో ఒక్క జూనియర్ డిగ్రీ పోస్టు కూడా ఫిలప్ చేయలేదు, గతంలో చేసింది కేసీఆర్ ప్రభుత్వమే.
- ఆనాడు మాట్లాడిన కోదండరామ్ ఎటు పోయాడు? తీన్మార్ మల్లన్న ఎటు పోయాడు? అకునూరి మురళి ఎటు పోయా రు? వరంగల్ గురించి మాట్లాడిన వారంతా ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు? అని ప్రశ్నించారు.
- వరంగల్ యువత ఉద్యమాల్లో ఏనాడూ వెనకడుగు వేయ లేదు. నాడు సమ్మక్క-సారలమ్మ పౌరుషం, రాణి రుద్రమ దేవి పౌరుషం, చాకలి ఐలమ్మ త్యాగం, దొడ్డి కొమురయ్య మొదటి అమరత్వం స్ఫూర్తితో మన ఉద్యోగాలు, నోటిఫికే షన్ల కోసం కచ్చితంగా కొట్లాడాల్సిన అవసరం ఉంది.
- వరంగల్‌కు ఇష్టమైన బతుకమ్మను తెలంగాణ తల్లి చేతిలో నుంచి మాయం చేశారు. మన కాకతీయ చిహ్నాన్ని కూడా ప్రభుత్వ చిహ్నాల నుండి తప్పించారు.
- ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం చదువుతో పాటు అడుగులో అడుగు వేసి పోరాడుదాం. రాకేష్ రెడ్డి చేస్తున్న ఇటువంటి సామాజిక సేవలు నిరంతరం కొనసాగాలని కోరుకుంటున్నాను.

















