- సాల్వాపూర్ గ్రామంలో వైభవంగా శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రతిస్థాపన మహోత్సవం
- ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
బచ్చన్నపేట:
గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలి. ఆలాగే జనగామ నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని ఆ ఎల్లమ్మ తల్లిని ప్రార్థించానని జనగామ ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని సాల్వాపూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రతిస్థాపన మహోత్సవ కార్యక్రమం (Conse cration Ceremony of the Renuka Yellamma Tem ple)భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా జరిగింది. గ్రామస్తులు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్ర మానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Janagama Mla Palla Rajeswer reddy) ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.ఈ సందర్బంగా ముందుగా ఆల యానికి చేరుకున్న ఎమ్మెల్యేకు అర్చకులు, గ్రామ పెద్దలు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో, విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్యే పల్లా పాల్గొ న్నారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అనంతరం ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ…
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు గ్రామ దేవతల పండుగలు, జాతరలు ప్రతీకలు అని తెలిపారు. మన సంస్కృతిని కాపాడుకుంటూ, భావితరాలకు అందించా ల్సిన బాధ్యత మనందరిపై ఉందని పల్లా పేర్కొన్నారు. అనంతరం ఆలయ నిర్మాణానికి కోసం కృషి చేసిన గ్రామ పెద్దలను, కమిటీ సభ్యులను మనస్ఫూర్తిగా అభినంది స్తున్నానని తెలిపారు.

















