17.4 C
London
Thursday, July 16, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ జనగామ అభివృద్ధి పనుల్లో జాప్యం సహించం..

జనగామ అభివృద్ధి పనుల్లో జాప్యం సహించం..

0
  • వారం రోజుల్లో పనులు మొదలు పెట్టాలి.
  • లేదంటే మున్సిపల్ కార్యాలయం ముట్టడి చేపడతాం.
  • 20 లక్షల ఇళ్ల హామీ ఏమైంది?.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే పల్లా 
  • ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను రాజకీయాలకు అతీతంగా చేపట్టాలి.
  • గుడిసెల్లో ఉండే నిరుపేదలు, వికలాంగులు, ఒంటరి మహిళలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి.
  • ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అనర్హులకు చోటు ఉండొద్దు.
  • ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇల్లు అందేలా బాధ్యతగా పనిచేయాలి.
  • నిజమైన పేదలకే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దక్కేలా జాబితాలు సిద్ధం చేయండి.

              జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ:

జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం జనగామ పట్టణ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులతో అత్యవ సర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మున్సి పల్ అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక(Municipal development works and selection of Indiramma houses) తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు.

సమావేశం ప్రారంభానికి ముందు తెలంగాణ ఉద్యమ గాయ కుడు, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ స్ఫూర్తిదాయక నాయకుడు దివంగత సాయిచంద్ మూడో వర్ధంతి సందర్భంగా ఆయన ను స్మరించుకున్నారు. సాయిచంద్ తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజల్లో చైతన్యం నింపారని, ఆయన లేని లోటు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తోందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం నాయకులతో కలిసి నిమిషం పాటు మౌనం పాటించి నివాళులర్పించారు.

జనగామ ఎమ్మెల్యే పల్లా పాయింట్స్ :

  • గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జనగామ మున్సిపాలి టీకి రూ.18 కోట్ల అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం మారిన తర్వాత నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరిగింది.
  • ఎన్నికలకు ముందు పనులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి సీత క్క చేత ప్రారంభోత్సవాలు చేయించినా, ఇప్పటి వరకు ఒక్క కాంట్రాక్టర్ కూడా పనులు చేపట్టలేదని విమర్శించారు.
  • వారం నుంచి పది రోజుల్లోగా పనులు ప్రారంభించకపోతే ప్రజలతో కలిసి భారీ ధర్నా చేపడతామని హెచ్చరించారు.
  • పట్టణంలో పరిశుభ్రత పూర్తిగా దెబ్బతింది. మున్సిపల్ కౌన్సిలర్లే స్వయంగా కాలువలు శుభ్రం చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకర మన్నారు. వెంటనే మున్సిపల్ కమి షనర్‌కు వినతిపత్రం అందజేసి, స్పందించకపోతే వందలాది మందితో మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు.
  • గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జనగామ నియోజకవ ర్గానికి సుమారు 1,400ఇళ్లు మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టామని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఇళ్ల మంజూరుపై ప్రజలను తప్పు దోవ పట్టిస్తోందని ఆరోపిం చారు.
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో 4.50 లక్షల ఇళ్లు ఇచ్చామని చెప్పడం పూర్తిగా వాస్తవ విరుద్ధమన్నారు.
  • గతంలో మంజూరైన ఇళ్ల సంఖ్య 2.60 లక్షలు దాటలేదని, అందులో కూడా సుమారు రెండు లక్షల ఇళ్ల పనులే ప్రారం భమయ్యాయని తెలిపారు.
  • ఎన్నికల సమయంలో 20 లక్షల ఇళ్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మూడేళ్లు పూర్తవుతున్నా ఆ హామీని అమలు చేయ లేదని విమర్శించారు.
  • రెండో విడతలో నియోజకవర్గానికి 2 వేల ఇందిరమ్మ ఇళ్లు కేటాయించే అవకాశం ఉంది. పాత లబ్ధిదారులు, గుడిసెల్లో నివసించే నిరుపేదలు, వికలాంగులు, ఒంటరి మహిళలు వంటి నిజమైన అర్హులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిం చారు.
  • కౌన్సిలర్లు, పార్టీ నాయకులు రాజకీయాలకు అతీతంగా అత్యంత పేదలను గుర్తించి, ఎలాంటి పొరపాట్లు లేకుండా లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేయాలి. ప్రతి అర్హుడికి న్యాయం జరిగేలా బాధ్యతాయు తంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here