18.2 C
London
Friday, July 17, 2026
Home అభివృద్ధి కార్యక్రమాలు బీఆర్ఎస్ హయాంలో గ్రామాల అభివృద్ధికి బలమైన పునాదులు వేశాం

బీఆర్ఎస్ హయాంలో గ్రామాల అభివృద్ధికి బలమైన పునాదులు వేశాం

0
  • ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలే నూతన గ్రామపం చాయతీ భవనాల నిర్మాణం లక్ష్యం
  • నాణ్యతతో, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలి 
  • అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశం
  • బచ్చన్నపేట మండలం గంగాపూర్ గ్రామంలో నూత న గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థా పన చేసిన ఎమ్మెల్యే 

బచ్చన్నపేట:

బచ్చన్నపేట మండలం గంగాపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి (For the construction of the new Gram Panchayat building)శుక్రవారం నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో జనగామ ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Mla palla) ముఖ్య అతిథి గా పాల్గొని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఎమ్మెల్యే పల్లా మీడియా పాయింట్స్:

  • బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధా న్యతనిస్తూ పల్లె ప్రగతి వంటి కార్యక్రమాల ద్వారా తెలంగాణ గ్రామాల రూపురేఖలు మార్చాం.
  • గ్రామపంచాయతీలను బలోపేతం చేయడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్ర మాలు చేపట్టామని గుర్తు చేశారు.
  • గ్రామపంచాయతీ భవనాలు ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించే కీలక కేంద్రాలు అని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి భవనాల నిర్మాణం తో గ్రామస్థులకు అన్ని పరిపాలనా సేవలు ఒకే చోట సులభంగా అందు బాటులోకి వస్తాయని తెలిపారు.
  • ప్రస్తుత ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. గ్రామపంచాయతీలకు తగిన నిధులు విడుద ల చేసి స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
  • ప్రజల డబ్బుతో చేపట్టే ప్రతి అభివృద్ధి పని నాణ్యతతో, పారదర్శ కంగా ఉండాలని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి రాజీ ఉండకూడదని, అధికారు లు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులో గ్రామపంచాయతీ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here