- కుటుంబానికి అండగా ఉంటామని భరోసా
చేర్యాల:
చేర్యాల మండలం పెద్ద రాజుపేట(peddaraju peta village)గ్రామానికి చెందిన ప్రము ఖ అడ్వకేట్ ఆంకని సురేందర్ బావ మరాఠీ కిషన్ గుండె పోటుతో అకాల మర ణం చెందారు. విషయం తెలుసుకున్న వెంటనే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి బుధవారం పెద్ద రాజు పేట గ్రామానికి చేరుకు ని మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మరాఠీ కిషన్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివా ళులు అర్పించారు. అనంతరం ఆకస్మిక మరణం కుటుంబా నికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ దుఃఖ సమయంలో ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు తెలిపారు.
అలాగే అడ్వకేట్ ఆంకని సురేందర్ ను ప్రత్యేకంగా పరామ ర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున, వ్యక్తిగతంగా ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

















