- ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా?
- బిఆర్ఎస్ నేతల అరెస్టులు అప్రజాస్వామికం
- కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జనగామ:
తెలంగాణ ఉద్యమ కారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని(The statue of former Narsampet MLA Peddi Sudarshan Reddy) అర్ధ రాత్రి వేళ భారీ పోలీసు బందోబస్తు మధ్య తొలగించడం అత్యంత దుర్మార్గమైన, అప్రజాస్వామిక చర్య అని జన గామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి(MLA Dr. Palla Rajeshwar Reddy)మంగళవారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి కేవలం మాజీ ప్రజాప్రతినిధి మాత్రమే కాదు..ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడిన ఉద్యమకా రుడు, ప్రజా గొంతుకగా నిలిచిన నాయకుడి విగ్రహాన్ని చీక ట్లో తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది? అని ఆయన ప్రశ్నించారు. పగటిపూట ప్రజల సమక్షంలో చేయాల్సిన చర్యను అర్ధరాత్రి పోలీసు బలగాలను మోహరించి చేయ డం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇది విగ్రహం తొలగింపు కాదు…ప్రజాస్వామ్య విలువలపై దాడి!
విగ్రహానికి అనుమతులు లేవనే కారణం చెబుతున్న ప్రభు త్వం, చట్టపరమైన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించ కుండా రాత్రికి రాత్రే విగ్రహాన్ని తొలగించడం సరైన పద్ధతి కాదన్నారు.
అంతేకాకుండా విగ్రహ తొలగింపును అడ్డుకుంటారనే భయంతో బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టులు చేయడం, హౌస్ అరెస్టులు చేయడం తీవ్రంగా ఖండిస్తు న్నామన్నారు.
నాయకులను అరెస్ట్ చేసి..గొంతులు నొక్కి..ప్రజా స్వామ్యాన్ని ఎలా కాపాడుతారు?
విగ్రహం తొలగించిన ప్రదేశానికి మీడియాను, ప్రజలను, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వెళ్లకుండా అడ్డు కోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వం తన చర్యలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కడం, అరెస్టులు చేయడం, హౌస్ అరెస్టులతో భయపెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదని హితవు పలికారు.
నర్సంపేటలో చోటుచేసుకున్న ఈ ఘటన రాజకీయ కక్ష సాధింపు ధోరణికి నిదర్శనంగా కనిపి స్తోందని పల్లా రాజేశ్వ ర్‌రెడ్డి అన్నారు. రాజకీయ విభేదాలను వ్యక్తిగత కక్షలకు, ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి వేదికగా మార్చడం సరికాదన్నారు.
అరెస్టులతో ఉద్యమ స్ఫూర్తిని అణచలేరు:
విగ్రహాన్ని తొలగించారు.నాయకులను నిర్బంధించారు.. కానీ ప్రజల గుండెల్లో ఉన్న నాయకుడి జ్ఞాపకాలను చెరి పేయడం ఎవరి వల్లా సాధ్యం కాదు అని పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు..
ప్రజాస్వామ్యంలో అధికారాలు శాశ్వతం కావు.. ప్రజలే అంతిమ నిర్ణేతలు అనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సూచించారు.
రాజకీయ కక్షసాధింపులకు స్వస్తి పలికి, ప్రజాస్వామ్య పద్ధ తిలో వ్యవహరించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి పల్లా రాజేశ్వ ర్‌రెడ్డి హితవు పలికారు.
ప్రజా ఉద్యమాల చరిత్రను, ఉద్యమకారుల త్యాగాలను గౌరవించాలి. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం బీఆ ర్ఎస్ పోరాటం కొనసాగుతుంది. ప్రజల గొంతుకగా నిలు స్తాం..కక్షసాధింపు చర్యలను ఎక్కడికక్కడ ప్రశ్నిస్తాం అని పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.

















