18 C
London
Monday, August 31, 2026
Home ప్రెస్​ నోట్స్​ సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం

సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం

0
  • ఆయన మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు
  • రైతాంగం కోసం జీవితాంతం పోరాడిన యోధుడు
  • సారంపల్లి మల్లారెడ్డి మృతికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సంతాపం

జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి 

జనగామ:

ప్రముఖ కమ్యూనిస్టు సీనియర్ నాయకుడు, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి (Sarampalli Malla Reddy, National Vice-Preside nt of the All India Kisan Sabha) మృతి పట్ల సోమ వారం ఓ ప్రకటనలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజే శ్వర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

రైతాంగం, కార్మికులు, పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం దశా బ్దాలుగా నిబద్ధతతో పోరాడిన మల్లారెడ్డి ప్రజా ఉద్యమాల్లో చెరగని ముద్ర వేశారని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. తన జీవితాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితం చేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు.

ముఖ్యంగా రైతుల సమస్యలు, భూమి హక్కులు, సాగునీటి వసతులు, నదీజలాల వినియోగం వంటి అంశాలపై మల్లా  రెడ్డికి ఉన్న లోతైన అవగాహన, అనుభవం ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. రైతాంగ ప్రయోజనాల కోసం ఆయన చేసిన నిరంతర పోరాటం ప్రజా ఉద్యమ చరి త్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని తెలిపారు.

వరంగల్ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో సారంపల్లి మల్లారెడ్డి కీలక పాత్ర పోషించారని, ఎన్నో ప్రజా సమస్యలపై ఉద్యమాలకు నాయకత్వం వహి స్తూ ప్రజల పక్షాన నిలిచారని పల్లా రాజేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యలపై ఆయన చూపిన నిబద్ధత, సూటితనం, పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శప్రాయమన్నారు.

వయోభారం, అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మల్లారెడ్డి కన్నుమూయడం అత్యంత బాధాకరమని అన్నారు. ఆయన మరణం కమ్యూనిస్టు ఉద్యమానికే కాకుండా రైతాంగ, కార్మిక, ప్రజా ఉద్యమాలకు కూడా తీరని లోటని పేర్కొన్నారు.

ప్రజల కోసం జీవితాంతం పోరాడిన ఒక నిబద్ధత కలిగిన ప్రజా నాయకుడిని కోల్పోవడం బాధాకరమని, ఆయన ఆశయాలు, ప్రజా సేవా స్ఫూర్తి భవిష్యత్ తరాలకు స్ఫూర్తి గా నిలుస్తాయని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.

సారంపల్లి మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సాను భూతిని తెలియజేస్తూ..ఈ సమయంలో వారికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఆలాగే మల్లారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తు న్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here