25.8 C
London
Monday, August 10, 2026
Home ప్రెస్​ నోట్స్​ ఎట్టకేలకు సాకారమైన పల్లా కృషి…

ఎట్టకేలకు సాకారమైన పల్లా కృషి…

0
  • తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు దేవాదుల జలాలు
  • రైతన్న ముఖంలో చిరునవ్వులు…!
  • అసెంబ్లీ నుంచి అధికారుల దాకా పల్లా నిరంతర పోరాటం ఫలితం
  • దేవాదుల జలాలతో వేలాది ఎకరాలకు సాగునీటి భరోసా

జనగామ:

రైతున్నల సాగునీటి కల ఎట్టకేలకు సాకారమైంది. దేవాదు ల ప్రాజెక్టు జలాలు తపాస్‌పల్లి రిజర్వాయర్‌(Tapaspally Reservoir)కు చేరడంతో రైతుల్లో ఆనందోత్సాహాలు వెల్లి విరిశాయి. పంటలకు నీరు అందుతుందనే ఆశతో రైతన్న ముఖంలో చిరునవ్వు విర బూసింది. వారి నిరీక్షణకు ముగింపు పలుకుతూ దేవాదుల జలాలు రిజర్వాయర్‌ను చేరుకోవడం స్థానిక రైతాంగానికి కొత్త ఆశలను నింపింది.

తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు దేవాదుల జలాలు చేరాలనే లక్ష్యంతో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి (Mla Palla Rajeswer reddy)నిరంతరంగా కృషి చేశారు. ఈ అంశాన్ని కేవలం ఒకసారి కాదు, పలుమార్లు తెలంగాణ శాసన సభలో బలంగా ప్రస్తా విస్తూ తపాస్‌పల్లి రైతుల సాగునీటి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. రైతుల ఇబ్బందులను వివరించి, వెంట నే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ ప్రతి అవ కాశాన్ని వినియోగించు కున్నారు.

శాసనసభతో పాటు వివిధ మీడియా సమావేశాలు, అధికా రిక సమీక్షా సమావేశాలు, సంబంధిత శాఖల ఉన్నతాధికా రులు, మంత్రులతో జరిగిన చర్చల్లోనూ తపాస్‌పల్లి రిజర్వా యర్‌కు దేవాదుల జలాలను విడుదల చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నిరంతరం ఒత్తిడి తీసుకొచ్చారు. రైతుల ప్రయోజనమే ధ్యేయంగా సమస్య పరిష్కారం కోసం ఆయ న చేసిన పట్టుదలతో కూడిన ప్రయత్నాలు చివరకు ఫలిం చాయి.

దేవాదుల జలాల రాకతో తపాస్‌పల్లి పరిసర ప్రాంతాల్లో వేలాది ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఏర్పడింది. ఈ సందర్బంగా తపాస్‌పల్లి రైతుల సాగునీటి కలను సాకా రం చేయడంలో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి చూపి న చొరవకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here