- కులమతాలకు అతీతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉంది
- పలు గణపతి మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ:
జనగామ పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు (Gan esh Navaratri Celebrations)భక్తిశ్రద్ధలతో, ఘనంగా కొనసాగుతున్నాయి. గణపతి ఉత్సవాల్లో భాగంగా సోమ వారం జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి (Janga on MLA Palla Rajeshwar Reddy) పట్టణంలోని పలు గణపతి మండపాలను సందర్శిస్తూ భక్తులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు.
ఇందులో భాగంగా పట్టణంలోని 18వ వార్డులో శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన గణపతి మండపాన్ని ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 22వ వార్డులోని పలు గణపతి మండపాలను సందర్శించి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా మండపాల నిర్వాహకులు, భక్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..
- విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జనగామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను.
- శ్రీ విఘ్నేశ్వర ఆలయ అభివృద్ధికి సంబంధించి గతంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే స్పందించి షెడ్ నిర్మాణానికి కృషి చేశాను.
- ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తాను.
- జనగామ పట్టణంలో కులమతాలకు అతీతంగా ప్రజలంతా కలిసి గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది.
- పండుగలు కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాకుండా ప్రజల మధ్య ప్రేమ, సోదరభావం, ఐక్యతను మరింత పెంపొందించేలా ఉండాలి.
- జనగామ ప్రజల సంతోషమే నాకు ముఖ్యమైనది. జనగామ అభివృద్ధితో పాటు ఆలయాలు, పుణ్యక్షేత్రాల అభివృద్ధికి కూడా నా వంతు సహకారం అందిస్తాను.

















