- జనగామలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు:
- డ్రగ్స్, అక్రమ మద్యం వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతుంది.
- పేద ప్రజలకు పోలీసులు అండగా నిలవాలి
- తల్లిదండ్రుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి
- అక్రమంగా నడుస్తున్న 25బెల్ట్ షాపులు వారంలోపే మూసివేయాలి
- లేకపోతే దళిత మహిళా సంఘాలతో ఉద్యమిస్తాం
- సిండికెట్ వ్యవస్థను పూర్తిగా బంద్ చేయాలి
- ఇది వ్యక్తిగత పోరాటం కాదు..జనగామ ప్రజలందరికీ ఉపయోగపడే నిర్మాణం
- కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడే పరిస్థితి లేదు
- అంబేద్కర్ మీటింగ్‌కు టైమ్ ఇవ్వనప్పుడు ఇంకెవరికి ఇవ్వరు. ప్రజా సమస్య కోసం వెళ్తే వినే ఓపిక ఉండదు..
- జనగామ కలెక్టర్ పై ఎమ్మెల్యే పల్లా తీవ్ర అసంతృప్తి
- బెల్ట్ షాపులు, సిండికెట్ దోపిడీ, దళిత మహిళలపై వివక్ష, అధికారుల నిర్లక్ష్యంపై సభలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే డా. పల్లా రాజే శ్వర్ రెడ్డి
జనగామ: జనగామ (Jangaon) జిల్లా కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో అంబేద్కర్ ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మహనీయులు డా. బాబా సాహెబ్ అంబేద్కర్ 137వ జయంతి వేడుకలకు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించినంతరం ఏర్పాటు చేసిన సభలో జనగామలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాజ్యాంగ సమానత్వం, దళితుల హక్కులు, అక్రమ మద్యం, అధికా రుల వైఖరి వంటి అంశాలపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జనగామలో అంబేద్కర్ రాజ్యాంగమే అమలు కావాలి: ఎమ్మెల్యే పల్లా
అంబేద్కర్ బోధనలు వినడమే కాకుండా వాటిని ఆచరణలో చూపిం చాలని ఎమ్మెల్యే పల్లా పిలుపునిచ్చారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో బి ఆర్ అంబేద్కర్ రాజ్యాం గం రచించారని గుర్తుచేశారు. నేడు రాజ్యాంగం గురించి మాట్లాడేవారు ఎక్కువైనా దాన్ని అమలు చేసే వారు తక్కువయ్యారని విమర్శించారు. జనగామలో ఒక రాజ్యాంగం, మిగతా ప్రాంతాల్లో మరో రాజ్యాంగం నడుస్తున్నట్లుగా పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ జయంతి సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరుకాకపోవడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు 10వ తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు ప్రకటించిన ఆర్థిక ప్రోత్సాహకాలు అమలు కాలేదు. ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దళితుల హక్కు లు జనగామలో పూర్తిగా అమలు కావడం లేదని పేర్కొన్నారు. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, సర్దార్ పాపన్న వంటి వీరుల పోరాట గడ్డలోనే రాజ్యాంగం సరిగా అమలవ్వకపోవడం బాధాకరమన్నారు.
జిల్లాలో అక్రమ మద్యం వ్యాపారం విస్తరిస్తోంది:
జిల్లాలో అక్రమ మద్యం వ్యాపారం విస్తరిస్తోంది. బెల్ట్ షాపులు అధికం గా పెరిగాయని ఎమ్మెల్యే పల్లా విమర్శించారు. ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతూ సిండికెట్ ప్రజలను దోచుకుంటోందని ఆరో పించారు. ఉదయం వేళల్లోనే మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. దళిత మహిళలకు ఇచ్చిన సహాయాన్ని కొత్త కలెక్టర్ రద్దు చేయడం అన్యాయమన్నారు. అదే ప్రాంతంలో ఇతర వర్గాలకు అనుకూలంగా పర్మిట్ రూములు నడు స్తుండటం రాజ్యాంగ సమానత్వానికి విరుద్ధమని పేర్కొన్నారు. దళిత మహిళలపై కేసులు నమోదు చేయడం, జర్నలిస్టులపై చర్యలు తీసుకో వడం కూడా అన్యాయమని విమర్శించారు. జనగామలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి, నిధులు మంజూరయ్యినా పను లను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇది ప్రజలందరికీ ఉపయో గపడే నిర్మాణమని, వెంటనే అడ్డంకులు తొలగించాలని అధికారులను కోరారు.
పోలీసులు పేద ప్రజలకు అండగా నిలవాలి:
పోలీసులు పేద ప్రజలకు అండగా నిలవాలి. డ్రగ్స్, అక్రమ మద్యం వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతోందని ఎమ్మెల్యే పల్లా ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ బెల్ట్ షాపులను వారంలోపే మూసివేయాలని, లేకపోతే దళిత మహిళా సంఘాలతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నందునే జనగామలో ఈ పరిస్థి తులు నెలకొన్నాయి. అయినప్పటికీ దళితుల హక్కుల కోసం చివరి వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. జనగామలో జనగామ రాజ్యాం గం కాదు..అంబేద్కర్ రాజ్యాంగమే అమలవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

















