15.2 C
London
Monday, June 1, 2026
Home అభివృద్ధి కార్యక్రమాలు న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ నిలిపివేత దుర్మార్గం

న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ నిలిపివేత దుర్మార్గం

0
Palla Rajeshwar Reddy
  • పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు తీవ్ర నష్టం
  • కేసీఆర్ కిట్‌తో ఆసుపత్రి ప్రసవాలు పెరిగాయి.
  • అంగన్వాడీ, ఆశ, ఏఎన్ఎం కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించాలి
  • భద్రత ఉంటేనే పూర్తి స్థాయిలో సేవలు అందించగలరు
  • ప్రభుత్వానికి ఇప్పటికే రేపర్సెంటేషన్ చేసాను
  • కేసీఆర్‌పై కోపంతో పథకాలు ఆపడం సరికాదు
  • వైద్య రంగ పథకాలను వెంటనే పునరుద్ధరించాలి
  • ప్రజల ఆరోగ్యంపై రాజకీయాలకు అతీతంగా దృష్టి పెట్టాలి
  • చేర్యాలలో చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రసన్న, అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ
  • ముఖ్య అతిథిగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

చేర్యాల:

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో బుధవారం చిన్నారు లకు అక్ష రాభ్యాసం, అన్నప్రసన్న, దుస్తుల పంపిణీతో పాటు అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగా మ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలకు ఉద్యోగ భద్రతతో పాటు జీతాలు, భత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. భద్రత, ఆర్థిక స్థిరత్వం ఉంటేనే వారు పూర్తి బాధ్యతతో సేవలు అందించగలరని పేర్కొన్నారు. ఈ అంశంపై ఇప్పటికే తాను ప్రభుత్వానికి ప్రతినిధిత్వం చేశా నని తెలిపారు.

న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ కొనసాగించాలి:

గత ప్రభుత్వం ప్రారంభించిన న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్‌లను నిలిపి వేయడం దుర్మార్గమని ఎమ్మెల్యే పల్లా తీవ్రంగా విమర్శించారు. పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఇవి ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. గర్భిణీ తల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పటి నుంచే పోషకాహారం అందితేనే బలమైన, ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడు తుందని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్ ద్వారా ఆసుపత్రి ప్రస వాలు పెరిగాయని, కూలీ కుటుంబాలకు ఆర్థికంగా, ఆరో గ్యంగా ఎంతో మేలు జరిగిందని గుర్తు చేశారు. 16 వస్తు వులతో కూడిన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్‌లను తిరిగి కొనసాగించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు.

ప్రభుత్వం తల్లిదండ్రుల్లా ఉండాలి:

ప్రభుత్వం తల్లిదండ్రుల్లా ప్రజలను ఆదుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. వైఎస్సార్ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అమలు చేస్తే, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నాయని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం కేసీఆర్‌పై కోపంతో వైద్య రంగంలో కొనసాగుతున్న పథకాలను ఆపిందని ఆరోపించారు. వెంటనే ఆ పథకాలను అమలు చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here