చిన్నారికి ప్రేమతో ముద్దు ఇచ్చిన కేసిఆర్

0
  • చిన్నారి ప్రేమకు కరిగిపోయిన బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ 

జగిత్యాల:

జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ కు వెళ్తున్న వేళ ప్రత్యేక బస్సులో ప్రయాణిస్తున్న బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ (BRS ADHINETHA KCR)చూపు ఒక్కసారిగా రోడ్డుపై నిలిచిపోయింది. చిన్నారి చేతిలో తన చిత్రపటాన్ని ప్రేమతో పట్టుకుని నిల్చున్న ఆ దృశ్యం ఆయన మనసును తాకింది. అంతే…వెంటనే బస్సును ఆపించారు. చిన్నారి దగ్గరకు వెళ్లి, ఆమె చేతిలోని కేసీఆర్ చిత్రపటాన్ని స్వయం గా స్వీకరించారు.ఆ చిన్నారి చెంపలపై చిరునవ్వుతో ముద్దుల వర్షం కురిపిస్తూ ఆప్యాయంగా ఆశీర్వదించారు. ఆ క్షణం అక్కడున్న ప్రతి ఒక్కరి మనసును కదిలించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here