14.1 C
London
Saturday, June 13, 2026
Home టాప్​ బ్రేకింగ్స్​ కృష్ణాజిగూడెం ప్రజలకు నీలిమ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందిస్తా

కృష్ణాజిగూడెం ప్రజలకు నీలిమ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందిస్తా

0
Neelima Hospital

జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి హామీ

జనగామ: స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం చిలుపూర్ మండలం కృష్ణాజిగూడెం గ్రామ ప్రజలకు హైదరాబాద్‌లోని తమ నీలిమ ఆసుపత్రి (Neelima Hospital) లో ఉచిత వైద్యం అందిస్తానని జనగామ ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం జిల్లా కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యలయంలో జిల్లా యువజన నాయకులు కేశిరెడ్డి రాకేష్ రెడ్డి, సీనియర్ నాయకులు జనగామ యాదగిరి ఆధ్వ ర్యంలో స్థానిక గ్రామస్తులు, నాయకులతో కలిసి గ్రామ సర్పంచ్ మల్లం రవీందర్ ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ కృష్ణాజిగూడెం గ్రామానికి చెందిన ఆధార్ కార్డు కలిగిన ప్రతి వ్యక్తికి నీలిమ ఆసుపత్రిలో పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. భోజన వసతి, ఉచిత మందులు, జీరో బిల్ విధానంలో వైద్య సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. అనం తరం ఆసుపత్రి వర్గాలకు జారీ చేసిన ఆదేశాల ప్రతిని గ్రామ సర్పంచ్‌కు ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో చిలుపూర్ మండల కన్వీనర్ రంగు హరీష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here