15.2 C
London
Thursday, June 11, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ రైతులు పండించడంలో కాదు…పంటను అమ్మడంలోనే ఇబ్బంది పడుతున్నారు

రైతులు పండించడంలో కాదు…పంటను అమ్మడంలోనే ఇబ్బంది పడుతున్నారు

0
  • రెండున్నర కాంగ్రెస్ పాలనలో…!
  • రైతులు పండించడంలో కాదు…పంటను అమ్మడంలోనే ఇబ్బంది పడుతున్నారు.
  • రైతు వ్యతిరేక డిస్కం, మోటార్ మీటర్ల విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం
  • ఆంధ్రుల కుట్రలు తెలంగాణలో మళ్లీ మొదలయ్యాయి
  • రైతుల హక్కుల కోసం మళ్లీ పోరాటానికి సిద్ధం కావాలి
  • శాంతియుత ఉద్యమంతో తెలంగాణ సాధించిన వీరుడు కేసీఆర్
  • కేసీఆర్ పాలనే రాష్ట్ర ప్రజలకు గుర్తొస్తోంది
  • 70 ఏళ్ల అన్యాయాన్ని 10 ఏళ్లలో బిఆర్ఎస్ పాలనలో సరిచేశాం
  • కేసీఆర్ ఆనవాళ్లను తొలగించాలన్న ప్రయత్నాలు ప్రజలు సహించరు
  • కాళేశ్వరం, దేవాదుల నీళ్లే కేసీఆర్ పాలనకు సాక్ష్యం
  • 10 ఏళ్ల అభివృద్ధి…రెండన్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం చేసింది

జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ:

జనగామ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జూన్‌ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని (TELANG ANA FORMATION DAY )పురస్కరించుకుని మంగళ వారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి (JANAG AMA MLA) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

జనగామ ఎమ్మెల్యే పల్లా పాయింట్స్:

  • జూన్‌ 2 అంటే తెలంగాణ ప్రజలందరికీ స్వాతంత్ర్యం వచ్చిన రోజు.
  • ఆ రోజున ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిలో ఆనందం ఉప్పొంగింది. పార్టీ, మత భేదాలు లేకుండా తెలంగాణ సాధన ఆనందాన్ని ప్రజలందరూ పంచుకున్నారని చెప్పారు.
  • 70 ఏళ్లుగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గత 10 ఏళ్లలో గణనీయంగా సరిచేశాం.
  • నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఉద్య మాన్ని ప్రారంభించి, ఒంటరిగా మొదలైన పోరాటాన్ని లక్షలాది మందిని వెంట నడిపిస్తూ, శాంతియుతంగా ఉద్యమం నిర్వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వీరుడు కేసీఆర్.
  • ప్రపంచంలోనే అరుదైన రీతిలో గాంధీజీ సూచించిన అహింసా మార్గం లో ఉద్యమాన్ని విజయవంతం చేశా రు.
  • కేసీఆర్‌ 10 ఏళ్ల పాలన గురించి ఈరోజు గ్రామం ఏదైనా, వాడ ఏదైనా, పార్టీకి అతీతంగా ప్రజలు ఒక్కటే చెబు తున్నారు. మేం మోసపోయాం…మాయమాటలకు ఓటు వేశామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
  • జూన్‌ 2న తొలిసారి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్ప టికీ, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన తెలం గాణ తల్లి విగ్రహాన్ని తొలగించి ఇతర రూపాన్ని పెట్టడం బాధాకరమన్నారు. అందుకే తెలంగాణ తల్లి స్ఫూర్తిని చ్చిన అసలైన విగ్రహానికి ఇక్కడ నివాళులు అర్పిస్తు న్నామని స్పష్టం చేశారు.

  • కాకతీయుల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటింది తెలంగాణేనని.
  • సుమారు 1200 ఏళ్ల క్రితమే టెక్నాలజీ లేకున్నా కాకతీయులు 75 వేల గొలుసుకట్టు చెరువులు నిర్మిం చారని, అటువంటి వ్యవస్థ ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పారు.
  • కాకతీయ కళాతోరణాన్ని తొలగించడం పట్ల వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలే ఎక్కువగా బాధపడ్డారు.
  • కేసీఆర్‌ ఆనవాళ్లను తొలగిస్తామని చెప్పడం దురదృష్ట కరమన్నారు. అవి కేవలం భౌతిక గుర్తులే కాదు, అభివృద్ధి చిహ్నాలన్నారు.
  • తక్కువ ఖర్చుతో, అద్భుతంగా నిర్మించిన రాష్ట్ర సచివా లయాన్ని గుర్తు చేశారు.
  • ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడు గుల విగ్రహాన్ని తెలంగాణలో ఏర్పాటు చేశామని, దానికీ తాళాలు వేసి ఆనవాళ్లు తొలగిస్తామనడం ప్రజల మనోభావాలను దెబ్బతీసింది.
  • ప్రజల ఒత్తిడితోనే మళ్లీ వాటిని తెరవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
  • కేసీఆర్ నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే ఈరోజు ముఖ్య మంత్రి పాలన సాగిస్తున్నారని విమర్శిం చారు.
  • రాష్ట్రంలో 30 మెడికల్ కాలేజీలు, అధునాతన ఆసు పత్రులు నిర్మించామని, వరంగల్‌లో దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి 90 శాతం పూర్తయ్యినా మిగిలిన నిధులు ఇవ్వకుండా ఆపేశారు.
  • దేవాదుల ప్రాజెక్టు, సమ్మక్క-సారలమ్మ బ్యారేజ్, ప్రపంచంలోనే అతి పెద్ద 42 కిలోమీటర్ల టన్నెల్ వంటి అనేక ప్రాజెక్టులు కేసీఆర్‌ పాలనలోనే సాధ్యమయ్యా యని వివరించారు.
  • కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ నుంచి ఆలేరు వరకు నీళ్లు అందుతున్నాయని, ఇవన్నీ కేసీఆర్‌ ఆనవాళ్లేనని చెప్పారు.
  • రైతులు నాలుగు నెలలు కష్టపడి పండించిన పంటను రెండు నెలల్లో అమ్ముకునేందుకు ఇబ్బంది పడుతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు రావడం లేదని, గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదని రైతులు గోసప డుతున్నారు..
  • 2014లో వరి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నెంబ ర్‌వన్‌గా నిలిచింది. 2022లో 142 లక్షల మెట్రిక్ టన్ను ల వరిని ఎఫ్‌సీఐకి సరఫరా చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు.
  • నేడు రైతు డిస్కంల పేరుతో, మోటార్ మీటర్ల పేరుతో రైతులకు నష్టం చేయాలని చూస్తున్నారని ఆరోపిం చారు. రైతు వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిం చాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
  • రెండున్నరేళ్లలో ప్రజలకు ఎలాంటి లబ్ధి జరగలేదని, రోడ్లు, ప్రాజెక్టులు, అభివృద్ధి కనిపించడం లేదని విమ ర్శించారు.
  • తెలంగాణ ప్రజలు మళ్లీ చైతన్యం పొందాల్సిన అవసరం ఉందని, రైతు వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని ఎమ్మెల్యే పల్లా పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here