- తెలంగాణ కోసం జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు
- జయశంకర్ ఆశయాలతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం
- ఆయన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి
- జనగామలో జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం
- విగ్రహ నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును నేనే భరిస్తా
- జయశంకర్ విగ్రహ స్థలాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి నిర్ణయించాలి
- జయశంకర్ జయంతి వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ:
తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి(Birth Anniversary of Professor Kotha palli Jayashankar) సందర్భంగా జనగామ పట్టణ కేంద్రంలోని 11వ వార్డులో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి (Janagama mla Palla) హాజర య్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో జయశంకర్ సేవలను స్మరించుకుంటూ ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మీడియా పాయింట్స్:
- తెలంగాణ ఉద్యమానికి తొలి బీజాలు వేసి, ప్రత్యేక రాష్ట్ర సాధనకు బలమైన సిద్ధాంతాన్ని అందించిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు.
- తెలంగాణ ఎందుకు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలనే అంశాన్ని చారిత్ర క, ఆర్థిక, సామాజిక, రాజకీయ కోణాల్లో శాస్త్రీయంగా విశ్లేషించి ప్రజలకు అర్థమయ్యేలా వివరించిన గొప్ప మేధావి అని అన్నారు.
- తన రచనలు, ప్రసంగాలు, సదస్సులు, ఉపన్యాసాల ద్వారా లక్షలాది మంది యువతలో తెలంగాణ చైతన్యాన్ని నింపారని తెలిపారు.
- వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఆశలు, ఆస్తులు, పదవులు, కుటుంబ బాధ్యతల గురించి ఆలోచించకుండా కేవలం తెలంగాణ రాష్ట్ర సాధనే తన జీవిత లక్ష్యంగా నిరాడంబ రంగా జీవించిన మహోన్నత వ్యక్తి జయశంకర్ అని అన్నారు.
- 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నుంచి చివరి వరకు విద్యా ర్థులు, ఉద్యోగులు, మేధావులు, ప్రజలకు అండగా నిలిచి ఉద్యమానికి నిరంతరం మార్గనిర్దేశం చేశారని గుర్తు చేశారు.
- తెలంగాణ సమాజంలో ఆత్మగౌరవ భావనను పెంపొందించ డంలో ఆయన పాత్ర అపూర్వమని పేర్కొన్నారు.
- జయశంకర్ ఆలోచనలు కేవలం ఉద్యమానికే పరిమితం కాకుండా తెలంగాణ భవిష్యత్ నిర్మాణానికి దిక్సూచిగా నిలిచాయని తెలిపారు.
- 2001లో కేసీఆర్ ప్రారంభించిన మలిదశ తెలంగాణ ఉద్య మానికి జయశంకర్ గారు సైద్ధాంతిక బలాన్ని అందించారని, ఉద్యమ దిశానిర్దేశంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.
- ఉద్యమ వ్యూహాల రూపకల్పనలో తన అనుభవాన్ని పంచుకుం టూ..తెలంగాణ సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఆయన నిరంతరం కృషి చేశారని చెప్పారు.
- తెలంగాణ ఉద్యమం విజయవంతం కావడంలో జయశంక ర్ ఆలోచనలు, సిద్ధాంతాలు, మార్గదర్శకత్వం ఎంతో కీలకమని ఎమ్మెల్యే అన్నారు.
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆయన ఆశ యాలకు అనుగుణంగా ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
- తెలంగాణ భాష, యాస, సంస్కృతిపై జయశంకర్ కు అపా రమైన పట్టు ఉందని, వివిధ ప్రాంతాల పదజాలంపై ఆయన చేసిన అధ్య యనం ఆదర్శనీయమని ఎమ్మెల్యే గుర్తు చేశా రు.
- తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన చేసిన సేవలు, ఆశయా లు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.
- ఈ సందర్భంగా జనగామ పట్టణంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని మరింత విశిష్టంగా ఏర్పాటు చేసేందుకు అవసర మైన స్థలాన్ని అధికారులు గుర్తిస్తే, విగ్రహ నిర్మాణం మరియు ప్రతిష్ఠాపనకు అయ్యే పూర్తి ఖర్చును వ్యక్తిగతంగా తానే భరిస్తానని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు.
- విగ్రహం ఏర్పాటు చేసే స్థలాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు కలిసి నిర్ణయించాలని సూచించారు.
- అనంతరం తెలంగాణ సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ పాత్ర, ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు భావితరాలకు శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తాయి. ఆయన చూపిన మార్గంలో నడవడమే ఆయనకు అందించే గొప్ప నివాళి అని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.

















