26.9 C
London
Saturday, May 30, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ కార్యకర్తకు అండగా..కంటికి రెప్పలా పల్లా!

కార్యకర్తకు అండగా..కంటికి రెప్పలా పల్లా!

0
  • బీఆర్ఎస్ సీనియర్ నేత ఉడుగుల నర్సిగం నివాసానికి వెళ్లి పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి  

జనగామ:

రాజకీయాల్లో పదవులు, ప్రచారాల కంటే కార్యకర్త క్షేమమే ముఖ్యం అని నమ్మే నాయకుడు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి..(Janagama Mla palla Rajeswer reddy)కష్ట కాలంలో తన నమ్ముకున్న వారిని గుండెల్లో పెట్టుకొని చూసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పడానికి ఈరోజు జరిగిన ఘటనే ఒక నిలువెత్తు నిదర్శనం!

నాయకుడంటే..కొండంత అండ!:

బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఉడుగుల నర్సిగం ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై, ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలిసిన వెంట నే గతంలోనే ఆసుపత్రికి వెళ్లి ఎమ్మెల్యే పల్లా పరామర్శిం చారు. నేడు(మంగళవారం )మరోసారి నేరుగా ఆయన నివాసానికి వెళ్లారు.

కదిలించిన పలకరింపు:

“ధైర్యంగా ఉండు నర్సిగం..నేనున్నాను! నీకు ఏ కష్టమొ చ్చినా ఎల్లప్పుడూ తోడుగా ఉంటా..త్వరగా కోలుకొని మళ్లీ ప్రజా క్షేత్రంలోకి రావాలి అంటూ పల్లా ఇచ్చిన భరోసా నర్సి గం కుటుంబంలో కొండంత ధైర్యాన్ని నింపింది.

కార్యకర్తను కుటుంబ సభ్యుడిలా కాపాడుకోవడం పల్లా నైజం!:

సాధారణంగా రాజకీయాల్లో కార్యకర్తలను కేవలం అవసర మైన సమయాల్లోనే గుర్తుచేసుకునే పరిస్థితులు చూస్తుం టాం. కానీ, ఒక కుటుంబ పెద్దలా కార్యకర్త ఇంటికి వెళ్లి, ఆప్యాయంగా పలకరించి, ధైర్యం చెప్పే పల్లా రాజేశ్వర్ రెడ్డి  సంస్కారం నిజంగా అభినందనీయం. నాయకుడంటే ఇలా నే ఉండాలంటూ స్థానిక బీఆర్ఎస్ శ్రేణులతో పాటు జన గామ నియోజకవర్గ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నా రు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here