- రైతుల కోసం ఢిల్లీలో పోరాడిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిది
- ఐదు సార్లు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది
- రూ.29,300 కోట్ల రైతు భరోసా బకాయిలు వెంటనే చెల్లించాలి
- కేసీఆర్ హయాంలో రైతుకు గౌరవం..కాంగ్రెస్ హయాంలో నిరాశ
- రైతు సంక్షేమంలో బీఆర్ఎస్ రికార్డులను కాంగ్రెస్ చేరుకోలేకపోయింది
- రైతు భరోసాపై ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోంది..
- రైతు కూలీలు, కౌలు రైతుల హామీలు ఏమయ్యాయి?
- ప్రతి ఎకరాకు రూ.5 వేల పెట్టుబడి సాయం వెంటనే ఇవ్వాలి
- రైతు వ్యతిరేక విధానాలను వెంటనే నిలిపివేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండ గట్టిన ఎమ్మెల్యే పల్లా
హైదరాబాద్:
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ (TELANGANA BHAVAN )శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి (JANAGAMA MLA) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యవసాయ రంగం, రైతు భరోసా (రైతు బంధు), రైతు భీమా, కొనుగోలు అమలులో ప్రస్తుత ప్రభు త్వం అనుసరిస్తున్న తీరును ఎండగడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ సాధనలను, రైతుల పట్ల చూపిన ఆదరణను ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రైతు భరోసా పై ఎమ్మెల్యే పల్లా మీడియా పాయింట్స్:
- గత ప్రభుత్వంలో వర్షాలు పడటానికి మూడు నెలల ముందే యూరియా, విత్తనాలు, వ్యవసాయానికి సంబం ధించిన అన్ని అవసరాలపై ముందస్తు రివ్యూలు జరి గాయి.
- ఒక సంవత్సర కాలంలో ఏ విధంగా సాగు చేయాలనే దాని పై వ్యవ సాయ శాఖ మంత్రి గారు స్వయంగా ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గానికి వెళ్లి మీటింగ్‌లు పెట్టారని, ఏ విత్తనా లు వేసుకోవాలి, ఏ విధంగా సాగులో మార్పు లు చేసుకోవాలనే విషయాలను రైతులకు క్షుణంగా తెలియజేశారని గుర్తు చేశారు.
- కేంద్ర ప్రభుత్వం వరి కొనే పరిస్థితి లేదని చెప్పినప్పుడు, గతంలో కెసిఆర్ గారు స్వయంగా చొరవ తీసుకున్నా రని ఆయన వివరించారు.
- మంత్రులు, అధికారుల చేత అనేకసార్లు రిప్రజెంటేషన్లు ఇప్పించడమే కాకుండా, తానే స్వయంగా ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులతో మాట్లాడారు.
- దేశ చరిత్రలోనే తొలిసారిగా వ్యవసాయ కొనుగోళ్ల కోసం ఎమ్మెల్యే లు, మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులందరినీ ఢిల్లీకి తీసుకెళ్లి ధర్నా చేసి, ఖచ్చితంగా వరి కొనా ల్సిందేనని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కొనిపించిన చరిత్ర కెసిఆర్ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు.
- గత నాలుగు రోజుల నుంచి టీవీల్లో, ఇతర మాధ్య మాల్లో ప్రభుత్వం ఒకటే ప్రకటనలు ఇస్తోంది. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశా మని రాష్ట్ర ప్రభు త్వం పచ్చి అబద్ధాలు చెప్తోందని మండిపడ్డారు.
- రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ, కేంద్ర ప్రభుత్వం లేదా ఎఫ్‌సిఐ లేఖల్లోని ఏ గణాం కాలు తీసుకున్నా వాస్తవాలు ఇప్పటికీ స్పష్టంగా తెలు స్తాయి.
- తెలంగాణ వచ్చిన కొత్తలో (2014 లో) యాసంగి, వానా కాలం రెండు పంటలకు కలిపి ఎఫ్‌సిఐ కోసం కొన్నది కేవలం 24 లక్షల 29 మెట్రిక్ టన్నులు మాత్రమేనని, కానీ ఆ తర్వాత క్రమక్రమంగా దాన్ని పెంచుకుంటూ పోయామని చెప్పారు.
- రైతులకు ఉచిత కరెంటు, సాగునీరు, విత్తనాలు, ఎరు వులను సమయానికి అందించడంతో పాటు, ప్రపం చంలోనే ఎక్కడా లేని విధంగా కెసిఆర్ ప్రభుత్వం పెట్టు బడి సాయాన్ని అందించిందని కొనియాడారు.
- భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే రైతు దగ్గర నుంచి సిస్తు (పన్ను) వసూలు చేయడం చూశాం కానీ, రైతు కు పెట్టుబడి సాయం అందించిన ఏకైక ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వమే…
- 11విడతలుగా 70 లక్షల మంది పట్టాదారులైన రైతు లకు ఎలాంటి బహిరంగ సభలు, ఆర్భాటాలు, వ్యవసా య శాఖ ప్రకటనలు లేకుండా..అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.72 వేల కోట్లను నేరుగా ఖాతాల్లో వేసిన ఘనత కెసిఆర్ గారిదని గుర్తు చేశారు.
- ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రేపు వేస్తాం..ఎల్లుండి వేస్తాం అంటూ ఇప్పటివరకు మూడు సార్లు రైతులను మోసం చేసిందని ఆయన ఆరోపించారు.
- 2024 వానాకాలంలో ఇవ్వాల్సిన మొత్తం సాయాన్ని పూర్తి గా ఇవ్వలేదు. 2025 లో కేవలం మూడు ఎకరాల లోపు ఉన్నవారికి మాత్రమే ఇచ్చారు.
- యాసంగిలో కూడా సిద్దిపేట పామాయిల్ ఫ్యాక్టరీ ఓపె నింగ్ మీటింగ్‌లో ఒకసారి, జగిత్యాల మీటింగ్‌లో కెసిఆ ర్ గారు గర్జించిన తర్వాత మరోసారి..ఇలా కేవలం రెండు ఎకరాల లోపు వారికి మాత్రమే బటన్ నొక్కి నిధులు విడుదల చేశారని దుయ్యబట్టారు.
- రెండున్నరేళ్ల కాలంలో 5 సార్లు ఇవ్వాల్సిన సాయాన్ని ఒక్క సారి పూర్తిగా ఎగ్గొట్టి, మిగతా సమయాల్లో మూడు ఎకరాలకు, రెండు ఎకరాలకు పరిమితం చేశా రని మండిపడ్డారు.
- ఈ 5 విడతల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రికార్డు స్థాయిలో రూ. 29,300 కోట్లు బాకీ పడింది. ఇవాళ వస్తుంది, రేపు వస్తుందని రైతులు ఇంకా ఎదురు చూస్తున్నారు.
- కాంగ్రెస్ మంత్రులు పెద్ద పెద్ద మీటింగ్‌లు పెట్టి అందరినీ తిడుతూ, రైతులకు ఏదో చేస్తున్నట్లు ఏతుల మాటలు (గొప్పలు) మాట్లాడుతున్నారు. కానీ ఇది ‘రైతుబంధు భరోసా బాగోతం’ అని రైతులకు బాగా తెలుసన్నారు.
- గతంలో కెసిఆర్ గారు రెండు పంటలకే కాదు..మూడు పంటలకు ఇవ్వాలని మాట్లాడిన వారు, ఇప్పుడెందుకు ఇవ్వడం లేదు? మూడు పంటలు ఎందుకు పండించడం లేదని ప్రశ్నించారు.
- కౌలు రైతులకు, రైతు కూలీలకు రూ. 12 వేలు ఇస్తామ ని, సొంత రైతులకు రైతు భరోసా ఇస్తామని హామీలు ఇచ్చార ని, కానీ ఇప్పుడు కౌలు రైతుల ముచ్చటే లేదు.. రైతు కూలీల ఊసే లేదు..పైగా ఉన్న రైతులకే కోతలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- నోరు ఉందని ఇష్టమొచ్చినట్లు తిడితే సరిపోదు.. క్షేత్ర స్థాయిలో ఎవరు దివానో రేపు మధిరలో మీరే చూసు కుంటారని హెచ్చరించారు. కెసిఆర్ గారు ఇచ్చి నట్లుగా ప్రతి ఎకరా భూమికి రూ. 5 వేల చొప్పున పెట్టు బడి సాయం వెంటనే విడుదల చేయాలని డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

















