- ఆయన మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు
- తెలంగాణ ఉద్యమంలో చెరగని ముద్ర వేసిన నాయకుడు
- ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను
- వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపిన జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ:
తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకు డు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండె పోటుకు(Former MLA Peddi Sudarshan Reddy suffers a heart attack) గురై గత ఐదు రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడవడం అత్యం త బాధాకరమని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకు ఎంతో సన్ని హిత అనుబంధం ఉందని పేర్కొన్నారు. ఎన్నో సందర్భాల్లో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారంపై కలిసి పని చేసిన జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేనివని పల్లా రాజేశ్వర్ రెడ్డి భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో తొలి నుంచి చివరి వరకు క్రియాశీలకంగా పనిచేసిన నిబద్ధత కలిగిన ఉద్యమ నాయకుడని, ప్రజల కోసం నిరంతరం పోరాడిన ప్రజానాయకుడని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన చేసిన సేవలు, ఉద్యమ స్ఫూర్తి, పార్టీ పట్ల చూపిన అంకితభావం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాయని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధిగా, పార్టీ నాయకుడిగా, ఉద్యమకారుడిగా ప్రతి బాధ్యతను సమర్థ వంతంగా నిర్వహిస్తూ వేలాది మంది కార్యకర్తలకు స్ఫూర్తి గా నిలిచారని అన్నారు.
ఆయన మరణం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే కాకుండా తెలంగాణ ఉద్యమానికి, నర్సంపేట ప్రాంత ప్రజలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
భగవంతుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చా లని ప్రార్థిస్తూ..వారి కుటుంబ సభ్యులకు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, పార్టీ శ్రేణులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

















