24.2 C
London
Monday, August 10, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ జనగామలో ఆత్మీయ విరామం

జనగామలో ఆత్మీయ విరామం

0
  • మద్రాస్ కాఫీ హౌస్‌లో కేటీఆర్, హరీశ్, పల్లా ఆత్మీయ ముచ్చట్లు
  • నల్లబెల్లి నుంచి తిరుగు ప్రయాణంలో జనగామలో ఆగిన బీఆర్ఎస్ అగ్రనేతలు

జనగామ:

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయ కులు స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ కార్యక్రమం కోసం నల్లబెల్లి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజే శ్వర్ రెడ్డి తిరుగు ప్రయాణంలో జనగామలో కాసేపు ఆగా రు.

ఈ సందర్భంగా జనగామలోని మద్రాస్ కాఫీ హౌస్‌లో టీ తాగుతూ ముగ్గురు నేతలు ఆత్మీయంగా(Three leaders sharing a friendly moment over tea) ముచ్చటించా రు. కొద్దిసేపు సరదాగా మాట్లాడుకుంటూ గడిపారు. కాఫీ హౌస్‌ కు వచ్చిన స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ముగ్గురు నేతలు ఒకే చోట ఉన్న విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు కాఫీ హౌస్‌కు చేరుకున్నారు. నేతలను కలు సుకుని ఆప్యాయంగా పలకరించారు. దీంతో మద్రాస్ కాఫీ హౌస్ పరిసరాల్లో కొద్దిసేపు సందడి నెలకొంది.

సాధారణంగా టీ తాగుతూ సాగిన ఈ ఆత్మీయ విరామం.. కార్యకర్తలు, అభిమానులకు మాత్రం ప్రత్యేక అనుభూతిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here