13.6 C
London
Monday, June 1, 2026
Home ప్రజా సమస్యలు కామిడి జీవన్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా

కామిడి జీవన్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా

0
Maddur News

మద్దూర్ (Maddur News) : జనగామ నియోజకవర్గం మద్దూరు మండలంలోని సలాక్‌పూర్ గ్రామా నికి చెందిన ఏఎంసీ వైస్ చైర్మన్ కామిడి జీవన్ రెడ్డి సతీమణి కామిడి అరుణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిన జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి బుధవారం వారి నివా సానికి చేరుకుని జీవన్ రెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి కామిడి అరుణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఈ విషాదాన్ని అధిగమించే ధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here