13.6 C
London
Monday, June 1, 2026
Home టాప్​ బ్రేకింగ్స్​ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యకు పల్లా మాస్ వార్నింగ్..! 

బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యకు పల్లా మాస్ వార్నింగ్..! 

0
  • తెలంగాణ ఏర్పాటుపై సూర్య చేసిన వ్యాఖ్యలను బీజేపీ ప్రభుత్వం వెంటనే ఖండించాలి
  • లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజల తీర్పు తప్పదు
  • సీలేరు ప్రాజెక్టును దక్కించుకున్నారు
  • ఐటీఆర్ వంటి కీలక ప్రాజెక్టులను ఇవ్వకుండా అడ్డుకున్నారు
  • తెలంగాణపై బీజేపీ నేతలు పదేపదే విషం చిమ్ముతున్నారు
  • కేంద్రం నుంచి నిధులు ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతోంది
  • ప్రాజెక్టులు, విద్యాసంస్థల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తోంది
  • వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు
  • బీజేపీ ప్రభుత్వంపై జనగామ ఎమ్మెల్యే పల్లా ఫైర్

జగిత్యాల:

బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య (bJP MP TEJESWI SURYA) చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ నుంచి గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఖండించకుండా మౌనం వహించడం సిగ్గుచేటు అని జనగా మ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా మండిప డ్డారు. గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 20న నిర్వహించనున్న బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు భారీ బహిరంగ సభకు ఏర్పాట్ల స్థల పరిశీలన అనంతరం ఆయన బీజేపీ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు గుప్పించా రు.

జనగామ ఎమ్మెల్యే పల్లా మీడియా పాయింట్స్:

  • తెలంగాణపై పదేపదే విషం చిమ్ముతున్న బీజేపీ నేతలపై పల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • గతంలో బీజేపీ సభ్యులే రాజీనామా చేసి మాతో కలిసి వచ్చిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు.
  • ఇద్దరు కేంద్రమంత్రులు, పలువురు బీజేపీ ప్రజాప్రతినిధులు తెలంగాణపై జరుగుతున్న అన్యాయాలపై ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు.
  • తెలంగాణ గురించి మాట్లాడాల్సిన సమయంలో మౌనం వహిస్తూ, ఇతర రాష్ట్ర నాయకులను సంతోషపెట్టే రాజకీయాలు చేయడం దురదృష్టకరమన్నారు.
  • అవసరమైనప్పుడు తెలంగాణకు మద్దతిచ్చినట్టు నటించి, ప్రతి క్షణం వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని బీజేపీపై విమర్శించారు.
  • తెలంగాణ ఏర్పాటుకు ముందే ఏడు మండలాలను దూరం చేశారని పేర్కొన్నారు.
  • సీలేరు ప్రాజెక్టును దక్కించుకోవడంతో పాటు, ఐటీఆర్ వంటి కీలక ప్రాజెక్టులను ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
  • ఒక్క ఐఐఎమ్ వంటి ప్రముఖ విద్యాసంస్థను కూడా తెలంగాణకు ఇవ్వలేదని విమర్శించారు.
  • కేంద్రం నుంచి సరైన నిధులు ఇవ్వకుండా తెలంగాణపై వివక్ష చూపుతున్నారని అన్నారు.
  • తెలంగాణ ప్రజలపై కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్న బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు.
  • తెలంగాణ పేరుతో గెలిచి, తెలంగాణ అవమానాన్ని చూసి నిశ్శబ్దంగా కూర్చున్న ఎంపీలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
  • తెలంగాణ ప్రజల ఓట్లతో ఎన్నికైన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు తేజస్వి సూర్య వ్యాఖ్యలను వెంటనే ఖండించాలని కోరారు.
  • పార్లమెంట్ సాక్షిగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినందుకు బీజేపీ పార్టీ తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
  • లేనిపక్షంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కకుండా ప్రజలు తీర్పు ఇస్తారని హెచ్చరించారు.
  • ఢిల్లీ పెద్దల ముందు వంగి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే, ప్రజలు తగిన సమాధానం చెబుతారని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here