15.2 C
London
Monday, June 1, 2026
Home పార్టీ కార్యక్రమాలు జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో భావోద్వేగ క్షణం

జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో భావోద్వేగ క్షణం

0
  • రైతుల కోసం రూ.75 వేల కోట్లు గుర్తుచేసిన కేసీఆర్
  • పల్లా రాజేశ్వర్ రెడ్డి సేవలను కొనియాడిన అధినేత
  • రైతు బంధు అమలులో పల్లా కీలక పాత్రపై ప్రశంసలు
  • సభలో హృదయాలను తాకిన కేసీఆర్ మాటలు

జగిత్యాల :

జగిత్యాలలో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాజీ ముఖ్యమంత్రి K. Chandra shekar Rao భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. రైతు సంక్షేమంపై ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతులకు సుమారు రూ.75 వేల కోట్ల ఆర్థిక సహాయం అందించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈసందర్భంగా జనగామ ఎమ్మెల్యే Palla Rajeshwar Reddy సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఎమ్మె ల్యేగా లేకపోయినా, రాష్ట్ర రైతు బంధు అధ్యక్షుడిగా నిలబ డి రైతు బంధు పథకం అమలులో కీలక పాత్ర పోషించి, రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు చేరేలా చేసినట్లు పేర్కొ న్నారు.ఈ మాటలు సభలో ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకా యి. ప్రత్యేకంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి సేవలను గుర్తు చేసిన సందర్భం మరింత భావోద్వేగాన్ని నింపింది.

ఈమాటలు వినగానే జనగామ జిల్లా ప్రజలు గర్వంతో ఉప్పొంగిపోయారు. మన నాయకుడిని గుర్తు పెట్టుకున్నా రు…మన కోసం పోరాడిన వారిని మరచిపోలేదు..అన్న ఆనందంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here