15.2 C
London
Monday, June 1, 2026
Home ప్రెస్​ నోట్స్​ మధుసూదన్‌తో ఎంతో కాలం నుంచి మంచి అనుబంధం..!

మధుసూదన్‌తో ఎంతో కాలం నుంచి మంచి అనుబంధం..!

0
  • ఆయన మృతి పట్ల ఎమ్మెల్యే పల్లా ప్రగాఢ సానుభూతి
  • మీడియా రంగానికి గొప్ప సేవలు చేసిన ఆయనకు నివాళి

జనగామ: ప్రస్తుత ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీస ర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ పాత్రికేయుడు మారబోయిన మధుసూదన్ (MARABOYINA MADHUSUDHAN ) తీవ్ర గుండె పోటుతో మరణించడం అత్యంత బాధాకరమని జనగామ ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి సోమవారం ఒక ప్రకట నలో తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో మధుసూదన్ సీనియర్ జర్నలిస్టుగా విశేష సేవలు అందిం చారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిబద్ధత, నిజాయి తీకి ప్రతిరూపంగా ఆయన నిలిచారని కొనియాడారు. మధు సూదన్ తో తనకు ఎంతోకాలంగా పరిచయం ఉంది. ఆయ న ఎంతో మృదుస్వభావి, వినయశీలి వ్యక్తిగా గుర్తుండిపో తారని ఎమ్మెల్యే తెలిపారు. మధుసూదన్ మృతి జర్నలిజం రంగానికి తీరని లోటని, వారి కుటుంబానికి ఇది అపూర్వ నష్టమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, వారికి మనోధైర్యం కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here