13.6 C
London
Monday, June 1, 2026
Home ప్రెస్​ నోట్స్​ కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి తీవ్ర ఖండనీయం

కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి తీవ్ర ఖండనీయం

0
  • హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి
  • రాజకీయాల్లో దాడులు కాదు…మాటకు మాటతోనే సమాధానం ఇవ్వాలి 
  • కరీంనగర్ ఘటనతో బీజేపీ అసలు స్వభావం బయటపడింది
  • విమర్శలు తట్టుకోలేక బీజేపీ నాయకత్వం దాడులకు దిగుతోంది
  • ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కును అణగదొక్కే ప్రయత్నం జరుగుతోంది
  • బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలి
  • దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి 
  • అహంకార రాజకీయాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు

           జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి  

జనగామ:

కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(PADI KOUSHIK REDDY) పై బండి సంజయ్ అనుచరులు చేసిన దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపైనే బీజేపీ గూండా లు దాడులకు తెగబడటం రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తి  గా క్షీణించాయని చెప్పడానికి నిదర్శనమన్నారు.

రాజకీయాల్లో మాటకు మాటతో సమాధానం చెప్పాలి గానీ, దాడులు చేసి విధ్వంసానికి పాల్పడటం బీజేపీ అసలు స్వభావాన్ని బయటపెడుతోందని విమర్శించారు. ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దురదృష్టకరమన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన వారే మౌనం  గా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోందన్నారు.

ఎమ్మెల్యే కార్యాలయంలో విధ్వంసం సృష్టించడం, కారు అద్దాలు పగులగొట్టడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూపిస్తోందన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడి ఒక వ్యక్తి పై దాడి మాత్రమే కాదని, అది ప్రజాస్వామ్యంపై దాడి అని పల్లా రాజేశ్వ ర్ రెడ్డి పేర్కొన్నారు.

ఇంకా బాధాకరం ఏమిటంటే మొత్తం ఘటనలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ దాడి చేసేవారికే సహకరిస్తున్నట్టుగా వ్యవహరించడం అత్యంత దురదృష్టకరమన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన వారే మౌనంగా ఉండటం రాష్ట్రంలో శాంతిభ ద్రతల పరిస్థితిపై తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉంది. కానీ బీజేపీ నాయకులు మాత్రం తమపై విమర్శ వస్తే భయపెట్టి దాడులు చేసి నోరు మూయించాలని చూస్తున్నా రని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమన్నారు. ఇలాంటి అహంకార, అరాచక రాజకీయా లను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ సహించరన్నారు.

బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలి..ఈ దాడికి పాల్పడిన వారి ని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అవసరమైతే ప్రజలే వీధుల్లోకి వచ్చి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here