- సిగ్గు శరం లేకుండా అలాయ్ బలాయ్ చేసుకుంటారా?
- మంత్రిని నేరుగా అడుగుతున్నా..మీకు ఏమైనా సిగ్గు శరం ఉందా?
- 70 లక్షల రైతులకు రూ.72 వేల కోట్లు ఇచ్చింది బీఆర్‌ఎస్…
- మేము రైతు సదస్సు పెడితే కాంగ్రెస్ బయపడుతుంది.
- రెండున్నరేళ్లలో సుమారు 1000 మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారు.
- ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిన రైతు హత్యలే.
- రైతులు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో హాజరైన సభ ఇదే వరంగల్ రైతు సంగ్రామ సదస్సు.
- కాంగ్రెస్ పాలనలో దేవాదుల నీళ్లు కేవలం 47 వేల ఎకరాలకు మాత్రమే ఇచ్చింది.
- బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక దేవాదుల ద్వారా 3 లక్షల 47 వేల ఎకరాలకు సాగునీరు అందించింది.
- ఈ ప్రభుత్వం అదనంగా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు. తట్టేడు మట్టి తీయలేదు…జానెడు కాలువ తీయలేదు.
- మీకు సిగ్గు శరం ఉంటే, రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే రూ.2000 కోట్లు ఇచ్చి దేవాదుల పూర్తి చేయండి.
వరంగల్ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం పై జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్
వరంగల్ :
ఓరుగల్లులో బుధవారం జరిగిన రైతు సంగ్రామ సదస్సుకు ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS WORKING PRESIDENT )హాజరయ్యారు. ఈ సదస్సుకు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అధ్యక్షత వహించారు. అనంతరం ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభు త్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒక్క ఎకరా నికి కేవలం రూ.6 వేలే ఇస్తూ రైతులను అవమానిస్తున్నార ని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గు శరం లేకుండా అలాయ్ బలాయ్ చేసుకుంటారా? మంత్రిని నేరుగా అడుగుతు న్నా..మీకు ఏమైనా సిగ్గు శరం ఉందా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ హయాం లో 70 లక్షల రైతు లకు రూ.72 వేల కోట్ల రైతు సాయం అందించామని ఆయన గుర్తుచేశారు. మేము రైతు సదస్సు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం భయపడు తోందని వ్యాఖ్యానించారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో సుమారు 1000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా రని, ఇవన్నీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిన రైతు హత్యలేనని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో కేవలం 47 వేల ఎకరాలకు మాత్రమే నీరు అందిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అదే ప్రాజెక్టు ద్వారా 3లక్షల 47 వేల ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు. ఈ ప్రభుత్వం అదనం గా ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదు. తట్టేడు మట్టి తీయలేదు…జానెడు కాలువ తీయలేదంటూ విమర్శించా రు. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయాలంటే కనీసం రూ.20 00 కోట్లు ఇవ్వాలని, రైతుల పట్ల చిత్త శుద్ధి ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో హాజరైన సభ ఇదే వరంగల్ రైతు సంగ్రామ సదస్సు అని ఆయన పేర్కొన్నారు.

జనగామ ఎమ్మెల్యే పల్లా పాయింట్స్:
- తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన పవిత్ర గడ్డ వరంగల్.
- రైతు ఉద్యమ స్పూర్తి ఇక్కడి నుంచే ప్రారంభమైంది.
- బీఆర్‌ఎస్ సభలు పెడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వణికిపోతోంది.
- ప్రజల మద్దతు ఎవరి వైపు ఉందో కాంగ్రెస్‌కు స్పష్టంగా తెలుసు.
- కేసీఆర్ జగిత్యాలలో మీటింగ్ పెట్టగానే, అదే రోజు అదే సమయానికి రేవంత్ రెడ్డి సభ పెట్టారు.
- కేసీఆర్ మీటింగ్‌కు 40 లక్షల మంది వస్తే, కాంగ్రెస్ వాళ్ల మీటింగ్‌కు 4 లక్షల మంది వచ్చారు. రేవంత్ సభ పూర్తిగా ఫ్లాప్ అయింది.
- మెడిగడ్డ మీటింగ్‌లో ఒక్క ఎకరానికి రైతు భరోసా వేసి మంత్రులు సీఎంతో అలాయ్ బలాయ్ చేసుకుంటున్నారు.
- 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ గారు 70 లక్షల మంది రైతులకు 11 విడతల్లో 72 వేల కోట్ల రూపాయలు నేరుగా అందించారు.
- 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో దేవాదుల నీళ్లు కేవలం 47 వేల ఎకరాలకు మాత్రమే ఇచ్చారు.
- కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక 2014 తరువాత 1500 కోట్లు ఇచ్చి, ప్రపంచంలోనే అత్యంత పెద్ద టన్నెల్‌ను రామప్ప నుంచి ఉనికి చర్ల వరకు తవ్వించి, ధర్మసాగర్ వద్ద మూడు భారీ మోటార్లు ఏర్పాటు చేశారు. సమ్మక్క సాగర్‌ను తుపాకుల గూడెం దగ్గర నిర్మించారు.
- బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక దేవాదుల ద్వారా 3 లక్షల 47 వేల ఎకరాలకు సాగునీరు అందించారు.
- 2014కు ముందు కాకతీయ కాలువ హుజురాబాద్ దాటలేదు.
- నేడు కాకతీయ కాలువకు 1000 కోట్లు కేటాయించి చివరి భూముల వరకు నీళ్లు అందించారు.
- డోర్నకల్, మహబూబాబాద్, భూపాలపల్లి, నర్సంపేట వరకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్ గారిదే.
- చెరువుల పునరుద్ధరణ, చెక్‌డ్యామ్‌లు, కొత్త విద్యుత్ కనెక్షన్లతో వరంగల్ జిల్లాను సస్యశ్యామలంగా మార్చారు.
- వరంగల్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో 70–80 శాతం ప్రాంతం సాగుభూమిగా మారింది.
- మొత్తంగా వరంగల్ జిల్లాను సస్యశ్యామలంగా మార్చిన ఘనత కేసీఆర్ గారిదే.
- సాగునీటి ప్రాజెక్టులతో వ్యవసాయాన్ని బలోపేతం చేశారు. నీళ్ల కోసం రైతు కన్నీరు పెట్టాల్సిన పరిస్థితి లేకుండా చేశారు. రైతు గుండెల్లో నిలిచింది బీఆర్‌ఎస్ మాత్రమే.
బిడ్డా గుర్తుంచుకో.!

- మీటింగ్ అంటే జాగా ఇవ్వరు! ఒక్క పైసా ఇవ్వనన్న కిరణ్ కుమార్ రెడ్డికి ఏ గతి పట్టిందో చూశాం.
- ఈ గడ్డ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదిన గడ్డ. నీ బాస్‌లు, వాళ్ల బాస్‌ల మెడలు వంచి తెలంగాణ రావడానికి ఊపిరి బాదిన గడ్డ ఈ వరంగల్.
- కాకతీయుల ప్రతాప స్ఫూర్తిగా పోరాటం చేస్తాం. రాణి రుద్రమదేవి పౌరుషం గల వాళ్లం.
- సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తిగా కొట్లాడుతాం. ఈ గడ్డ మట్టి మాణిక్యాలు దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, సర్దార్ పాపన్నల స్ఫూర్తితో కొట్లాడుదాం.
- మా జయశంకర్ సర్, కాళోజి కవితా గానం సాక్షిగా, పాఠాల సాక్షిగా కొట్లాడుదాం.
- మీ మెడలు వంచుతాం…మా రైతన్నలకు ఇచ్చిన హామీలను సాధిస్తాం..
- వరంగల్ రైతన్నలకు పోరాటానికి రామన్న తోడు అయితే, బీఆర్‌ఎస్ తోడై, మీ భరతం పడుతాం.

















