17.4 C
London
Thursday, July 16, 2026
Home టాప్​ బ్రేకింగ్స్​ రైతుకు యూరియా ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం ఇది..!

రైతుకు యూరియా ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం ఇది..!

0
  • 75 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం..రైతుల కోసం యూరియా ఎందుకు తేలేకపోయారు?
  • యూరియా కోసం రైతులు క్యూల్లో..కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రలో ఉంది.
  • యూరియా సంక్షోభానికి సీఎం, వ్యవసాయ మంత్రే బాధ్యులు
  • యాప్ పేరుతో యూరియాపై ఆంక్షలు.. రైతులపై కాంగ్రెస్ దౌర్జన్యం
  • రైతు భరోసా లేదు..కరెంట్ లేదు..ఇప్పుడు యూరియా కూడా లేదు
  • కేసీఆర్ హయాంలో ఎరువుల కొరత లేదు..కాంగ్రెస్ పాలనలో రైతుకు కష్టాలే..

                  జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి 

హైదరాబాద్:

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్రంలో యూరియా కొర త, పంపిణీ(URIYA PAMPINI)అంశం పై ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

యూరియా కొరత పై పల్లా పాయింట్స్:

  • కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను సక్రమంగా అమలు చేయడం లేదు. వ్యవసాయానికి అవసరమైన విద్యు త్‌ను కూడా సరిగా సరఫరా చేయడం లేదు. ఇప్పుడు యూరి యా విషయంలో కూడా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు.
  • రైతులకు రెండు బస్తాల యూరియానే ఇస్తామని, అదీ యాప్ ద్వా రా మాత్రమే అందిస్తామని కొత్త ఆంక్షలు విధిం చడంపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.
  • గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యూరియా సరఫరా లో రవాణా సమస్యలు తలెత్తినప్పుడు, అప్పటి ముఖ్య మంత్రి కేసీఆర్ గారు స్వయంగా సంబంధిత జీఎంలతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేవారని గుర్తు చేశారు.
  • ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రి, అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తగిన చర్యలు తీసుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందు లు కలగకుండా చూసేవారు..
  • బీఆర్ఎస్ పాలించిన తొమ్మిదిన్నరేళ్ల కాలంలో ఒక్క సీజన్‌ లో కూడా యూరియా కోసం గానీ, ఇతర ఎరువుల కోసం గానీ రైతులు ఇబ్బంది పడలేదని పేర్కొన్నారు. ఎరువుల కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎప్పుడూ రాలేదు. రైతులకు సకాలంలో ఎరువులు అందించిన ఘన త కేసీఆర్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి 75 సార్లు వెళ్లారని చెబు తున్నారని, అయితే రైతుల అవసరాల కోసం కేంద్రాన్ని ఎందుకు ఒప్పించలేకపోతున్నారని ప్రశ్నించారు.
  • రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ వంటి అంశాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి భూములు తెచ్చుకునే సామర్థ్యం ఉన్నప్పుడు, రైతులకు అవసరమైన యూరియాను ఎందుకు సాధించలేకపోతున్నారని నిలదీ శారు.
  • తెలంగాణ రైతులకు అవసరమైన యూరియాను వెంటనే అందించాలి. గతంలో అమలైన విధంగానే యూరియా సరఫరా వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేశారు.
  • రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అవుతున్న యూరి యాలో రాష్ట్రానికి అవసరమైన కోటాను కనీసం పూర్తి స్థాయిలో కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
  • తెలంగాణలోని రామగుండం ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అవుతున్న యూరియా మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రా లకు తరలిపోతుంటే, రాష్ట్ర ప్రభుత్వం చేతులు ముడుచు కుని చూస్తోందని విమర్శించారు.
  • కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా చేతగాని ప్రభుత్వంగా మారింది. ముఖ్యమంత్రి మరియు వ్యవసాయ శాఖ మంత్రి వైఫల్యాల కారణంగా రాష్ట్ర వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని తీవ్ర విమర్శలు చేశారు.
  • రైతులకు అవసరమైన కనీస యూరియాను కూడా సకా లంలో అందించలేని దారుణ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.
  • ఇప్పటికైనా రైతులకు అవసరమైన యూరియాను తక్షణ మే, సక్రమంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మె ల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here