15.2 C
London
Monday, June 1, 2026
Home పార్టీ కార్యక్రమాలు సాయి భగీరథ అరెస్టులో ఆలస్యం ఎందుకు?

సాయి భగీరథ అరెస్టులో ఆలస్యం ఎందుకు?

0
  • బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలి
  • మహిళల భద్రతపై సీఎం రేవంత్ సమాధానం చెప్పాలి
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి
  • బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్
  • నిందితుడిని కాపాడితే ఆందోళనలు తీవ్రం చేస్తాం
  • జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన బిఆర్ ఎస్ నాయకులు ఫైర్ 

జనగామ:

మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి తప్పించుకుని తిరుగుతున్న కేంద్ర సహాయ మంత్రి Bandi Sanjay Kumar కుమారుడు సాయి భగీరథను వెంటనే అరెస్టు చేసి బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని బీఆర్‌ఎస్ పార్టీ జనగామ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, పలువురు ప్రజాప్ర తినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా  లను డిమాండ్ చేశారు. జనగామ ఎమ్మెల్యే డాక్టర్ Palla Rajeshwar Reddy క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడా రు. ఈ సందర్భంగా అత్యాచారానికి పాల్పడిన సాయి భగీ రథను రక్షించేందుకు ఆయన తండ్రి బండి సంజయ్ అధి కార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గతంలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్, ఇప్పుడు తన కుమా రుడిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చట్టం లోని లొసుగులను ఉపయోగించుకుని తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. “బేటీ బచావో..బేటీ పడావో” నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పే బీజేపీ నాయకులకు ఈ ఘటన సిగ్గుచేటుగా నిలిచిందన్నారు.

సాయి భగీరథ అరెస్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిసి నిందితుడిని కాపాడేందుకు ప్రయ త్నిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర హోం శాఖను స్వయం గా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి A. Revanth Reddy వెంట నే స్పందించి నిందితుడిని అరెస్టు చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. మహిళల భద్రత పై తరచూ మాట్లాడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మహి ళా లోకానికి సమాధానం చెప్పాలని కోరారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తగిన చర్యలు తీసుకో వాలని, లేనిపక్షంలో బాధితురాలు మరియు ఆమె కుటుం బ సభ్యుల రక్షణ కోసం ఆందోళనలను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here