15.2 C
London
Monday, June 1, 2026
Home పార్టీ కార్యక్రమాలు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి..!

సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి..!

0
  • బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్టు చేయాలి
  • రాజకీయ ఒత్తిడులకు లొంగకుండా దర్యాప్తు జరపాలి
  • పోక్సో కేసును వేగంగా విచారించాలని విజ్ఞప్తి
  • బాధిత కుటుంబానికి త్వరిత న్యాయం చేయాలని డిమాండ్
  • మద్దూరులో బీఆర్‌ఎస్ నాయకుల ప్రెస్ మీట్

 

మద్దూరు:

మద్దూరు మండల కేంద్రంలో సోమవారం బీఆర్‌ఎస్ మండ  ల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి Bandi Sanjay Kumar, ఆయన కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు పై బీఆర్‌ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్ బాలికపై జరిగిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ.. మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని పేర్కొన్నారు. పోక్సో చట్టం కింద నమోదైన కేసులో రాజకీ య ప్రభావాలకు తావులేకుండా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. ఘటనపై నైతిక బాధ్యత వహి  స్తూ బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి A. Revanth Reddy ఈ అంశంలో వెంటనే జోక్యం చేసుకుని బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ ఒత్తిడులకు లోనుకాకుండా కేసును వేగంగా విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ మండల నాయకులు డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here