13.6 C
London
Monday, June 1, 2026
Home పార్టీ కార్యక్రమాలు పోక్సో కేసుపై సీఎం రేవంత్ కు ఎందుకు మౌనం?

పోక్సో కేసుపై సీఎం రేవంత్ కు ఎందుకు మౌనం?

0
  • బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి
  • బండి సంజయ్‌ను వెంటనే భర్తరఫ్ చేయాలి
  • భగీరథ్‌పై వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి 
  • కేసును నీరుగార్చే ప్రయత్నాలు ఆపాలి
  • మైనర్ బాలిక కేసులో నిజానిజాలు వెలికితీయాలి
  • న్యాయవ్యవస్థ స్వతంత్రంగా విచారణ జరపాలి

            మైనర్ బాలిక కేసుపై చేర్యాలలో బీఆర్‌ఎస్ ఫైర్

చేర్యాల:

సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రంలో సోమవారం బీఆర్‌ ఎస్ నాయకులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి Bandi Sanjay Kumar, ఆయన కుమారుడు Bandi Sai Bhageerath పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపు లు, పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుంచి వెంటనే భర్తరఫ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతూ..

మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొం టున్న వ్యక్తిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటే స్వతంత్ర దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు. అధికార ప్రభావంతో కేసును నీరుగార్చే ప్రయ  త్నాలు జరిగితే ప్రజలు సహించరని హెచ్చరించారు.

హైదరాబాద్‌లోని Pet Basheerabad Police Station లో నమోదైన పోక్సో కేసును ప్రస్తావిస్తూ..డిసెంబర్ 31న మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని డిమాండ్ చేశారు. మరోవైపు భగీరథ్ చేసిన కౌంటర్ ఫిర్యాదుపై కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నప్పటికీ అసలు బాధితు రాలికి న్యాయం జరగడమే ముఖ్యమన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి A.Revanth Reddy, హోంమంత్రి ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదని బీఆర్‌ఎస్ నేతలు ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ఎలాంటి హాని జరిగినా కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో పాటు రాష్ట్ర ప్రభు త్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చ రించారు.

న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని బీఆర్‌ఎస్ నాయకులు స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here