- సభ్యత్వ నమోదు బాధ్యతలు అప్పగించిన అధినేత కేసీఆర్
ఎర్రవెల్లి:
K. Chandrashekar Rao అధ్యక్షతన మంగళవారం ఎర్ర వెల్లి ఫామ్ హౌస్ లో జరిగిన Bharat Rashtra Samithi ప్రధాన కార్యదర్శుల సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సభ్యత్వ నమోదు చేపట్టాలని నిర్ణయిం చిన పార్టీ, జిల్లాల వారీగా ఇంచార్జీల నియామకానికి శ్రీకారం చుట్టింది.
ఈ క్రమంలో Palla Rajeshwar Reddyకు జనగామ, హన్మకొండ , వరంగల్ జిల్లాల సభ్యత్వ నమోదు కార్యక్రమ బాధ్యతలను అప్పగించారు. మూడు కీలక జిల్లాల బాధ్య తలను ఒకేసారి పల్లాకు అప్పగించడం పార్టీ అధిష్ఠానం ఆయనపై ఉంచిన నమ్మకాన్ని తెలియచేస్తుంది.
పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లేలా పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు సమాచారం. మండల, మున్సిపల్ స్థాయిలో కమిటీల ఏర్పాటు, పార్టీ శ్రేణులతో సమీక్ష సమా వేశాలు, గ్రామాల్లో డిజిటల్ నమోదు వేగవంతం చేసే చర్య లను పర్యవేక్షించనున్నారు.
జనగామ జిల్లాకు చెందిన బాధ్యతలను కూడా పల్లాకు అప్పగించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ బలోపేతం, కేడర్ చైతన్యం, గ్రామ స్థాయి విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ముందుకు సాగనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
హైలెట్స్:
- Palla Rajeshwar Reddyకు మూడు జిల్లాల బాధ్యతలు
- జనగామ, Hanamkonda, Warangal సభ్యత్వ నమోదు ఇంచార్జీ
- K. Chandrashekar Rao సమావేశంలో కీలక నిర్ణయం
- డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం
- గ్రామ స్థాయి వరకు Bharat Rashtra Samithi విస్తరణపై ఫోకస్

















