17.9 C
London
Sunday, May 31, 2026
Home అభివృద్ధి కార్యక్రమాలు నేనే స్వయంగా ఖర్చును భరిస్తాను..!

నేనే స్వయంగా ఖర్చును భరిస్తాను..!

0
Palla news
  • పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
  • పడమటి కేశవపూర్‌లో పాఠశాల అభివృద్ధికి హామీ
  • జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

బచ్చన్నపేట : పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న షెడ్ పనులతో పాటు స్టేజ్ నిర్మాణానికి అవస రమైన ఖర్చును నేను స్వయంగా భరిస్తాను. పనులు త్వరితగ తిన పూర్తి చేయాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla rajeshwar reddy) స్పష్టం చేశారు. సోమవారం జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండలంలోని పడమటి కేశవపూర్ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా గ్రామంలో ఓపెన్ జిమ్ పరి కరాలు ఏర్పాటు చేయడంతో పాటు గ్రామ గ్రంథాలయానికి అవసరమై న పుస్తకాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామ అధ్యక్షు డు చల్లా తిరుపతి రెడ్డికి ఆదేశించారు. సంబంధిత పనులను త్వరగా పూర్తి చేయాలని గ్రామ సర్పంచ్ ఎర్రోళ్ల విజయ సోములను కోరారు. అనంతరం స్థానిక నాయకుడు చల్లా శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి మేరకు పాఠ శాల అభివృద్ధి కోసం కంప్యూటర్లు, డెస్క్‌లు, బుక్ ర్యాక్స్, ఆట వస్తు వులు తదితర సుమారు రూ.5 లక్షల విలువైన సామగ్రిని పిఎసి ఎఎస్ డైరెక్టర్ నిమ్మ శ్యాంసుందర్ రెడ్డి సహోదరుడు నిమ్మ అనిల్ రెడ్డి అందిం చారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే పల్లా ప్రత్యేకంగా అభినందన లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here