- సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలి
- అధికారులు, మిల్లుల యాజమాన్యంతో చర్చించి సమస్యల పరిష్కారంకు కృషి చేస్తాను.
- అకాల వర్షాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి
- బచ్చన్నపేట మండలంలో పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు
- ముఖ్య అతిధిగా పాల్గొన్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండలంలోని చిన్న రాంచర్ల, కొడవటూరు, నక్కవని గూడెం, రామ చంద్రపురం, కొన్నె, పడమటి కేశవపూర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడే కోతలు ప్రారంభమయ్యాయి..కొనుగోలు కేంద్రాల్లో 17 శాతం తేమ ప్రమాణాలతో వరి ధాన్యాన్ని స్వీకరిస్తామని, ఒక సారి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించిన తర్వాత అక్కడ తిరస్కరించే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. ఇక్కడ నాణ్యతను పరిశీలించి ధాన్యం తీసుకుంటే, మిల్లుల వద్ద తేమ ఉంది అంటూ తిరస్క రించడం అనుచితం. అలాంటి సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమస్యలు వస్తే తక్షణమే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని, మిల్లుల యాజమాన్యంతో కూడా చర్చించి సక్రమంగా ధాన్యం దిగుమతి జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన విద్యుత్ సదుపాయం కల్పిం చేందుకు సర్పంచులతో మాట్లాడి తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అకాల వర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిం చారు. ప్రభుత్వం రైతులకు సరైన సమయంలో డబ్బులు జమా అయ్యేలా నేను అండగా ఉంటాను. కొనుగోలు కేంద్రాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.

















