17.4 C
London
Thursday, July 16, 2026
Home టాప్​ బ్రేకింగ్స్​ కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు..!

కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు..!

0
  • పోలీసుల తీరుపై ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్
  • ప్రతిపక్ష నేతల పర్యటనను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం
  • పెంబర్తిలో ఉద్రిక్తత..కేటీఆర్, పల్లా పోలీసులతో తీవ్ర వాగ్వాదం

జనగామ:

జనగామ జిల్లా పెంబర్తి వద్ద ఆదివారం తీవ్ర రాజకీయ ఉద్రి  క్తత నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌ స్‌ను(Kannepalli pampuhouse) సందర్శించేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్(BRS Working President KTR) కాన్వాయ్‌ను పోలీసులు పెంబర్తి చెక్‌పోస్ట్ వద్ద భారీ బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డు కున్నారు. దీంతో అక్కడ బీఆర్‌ఎస్ నాయకులు, కార్య కర్తలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేటీఆర్ కాన్వాయ్ పెంబ ర్తి చేరుకోగానే పోలీసులు కేవలం కేటీఆర్ వాహనానికి మాత్రమే అనుమతి ఇస్తామని, మిగిలిన నాయకులు, కార్య కర్తల వాహనాలను ముందుకు అనుమతించబోమని స్ప ష్టం చేశారు. ఈ నిర్ణయంపై బీఆర్‌ఎస్ శ్రేణులు తీవ్ర అభ్యం తరం వ్యక్తం చేశాయి.

హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేటీఆర్ కాన్వాయ్ జన గామ జిల్లా పెంబర్తి చెక్‌పోస్ట్ వద్దకు చేరుకోగానే పోలీసులు రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టారు. శాంతిభద్రతల సమస్య దృష్ట్యా కేవలం కేటీఆర్ వాహనాన్ని మాత్రమే ముందుకు అనుమతిస్తామని, ఆయన వెంట ఉన్న మిగతా నాయ కులు, కార్యకర్తల వాహనాలను ఎట్టిపరిస్థితుల్లోనూ రాని చ్చేది లేదని పోలీసులు ఖరాఖండిగా చెప్పారు.

పోలీసుల తీరు పై పల్లా ఫైర్…

దీంతో కేటీఆర్‌కు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో అనుచరులతో అక్కడికి చేరుకున్న జనగామ ఎమ్మెల్యే డాక్ట ర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పోలీసుల తీరుపై తీవ్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నాయకుల పర్యటనలను కూడా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఒకే వాహనాన్ని అనుమతించి మిగిలిన వారిని నిలిపివేయడం అన్యాయం అంటూ పోలీసులను నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వా దం చోటుచేసుకుంది.

పోలీసులు ఆంక్షలు విధించడంతో ఆగ్రహించిన బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా బారికేడ్ల వైపు దూసుకెళ్లారు. వాటిని దాటుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడం తో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తీవ్రస్థాయిలో నెట్టి వేతలు, తోపులాట జరిగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ప్రభు త్వం ఉద్దేశపూర్వకంగానే పోలీసులను అడ్డం పెట్టుకుని తమ పర్యటనలను అడ్డుకుంటోందని, ప్రజాస్వామ్యబ ద్ధంగా వెళ్తున్న తమపై ఆంక్షలు పెట్టడం దుర్మార్గమని కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here