పెండింగ్ క్లెయిమ్‌లపై సమాధానం చెప్పాలి
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
హైదరాబాద్:
హైదరాబాద్ తెలంగాణ భవన్ లో శనివారం ఏర్పాటు చేసి న మీడియా సమావేశంలో రైతు భీమా పథకం(RYTHU BHIMA SCHEME)అమలుపై కూడా ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
రైతు భీమాపై పల్లా పాయింట్స్:
- గతంలో 42 లక్షల మంది రైతులకు రైతు భీమా అందించ గా, అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల మంది కొత్త పట్టాదారులు పెరిగారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం భీమా లబ్ధిదారుల సంఖ్యను పెంచలేదని మండిపడ్డారు.
- రైతుల సంఖ్య పెరిగినప్పుడు దానికి అనుగుణంగా ప్రభు త్వం ఎల్‌ఐసీకి చెల్లించే ప్రీమియం కూడా పెంచాల్సి ఉంటుంది. కానీ అలా చేయడంలో ప్రభుత్వం విఫలమైం దని విమర్శించారు.
- తన జనగామ నియోజకవర్గంలోనే 229 మంది రైతులు మరణించగా, ఇప్పటికీ 75 రైతు భీమా క్లెయిమ్‌లు ఎల్‌ఐసీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్లెయిమ్‌లు ఎందుకు పెండిం గ్‌లో ఉన్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాం డ్ చేశారు.
- కేసీఆర్ ప్రభుత్వం హయాంలో రైతు భీమా పథకం కింద ఎవరైనా రైతు మరణిస్తే, పది రోజుల్లోపు అంటే దశదిన కర్మలోపే ఆ కుటుంబానికి భీమా సొమ్ము అందించి ఆదు కున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
- దాదాపు లక్షా 35 వేల మంది రైతు కుటుంబాలకు రైతు భీమా కింద ఎలాంటి దరఖాస్తులు అవసరం లేకుండానే, నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో పది రోజుల్లోనే డబ్బులు జమ చేసిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు.
- ఉన్న రైతు భీమా పథకానికే ప్రీమియం సక్రమంగా చెల్లించే సామ ర్థ్యం ఈ ప్రభుత్వానికి లేదా అని పల్లా రాజేశ్వర్ రెడ్డి నిలదీశారు.
- రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, రైతు భీమా క్లెయిమ్‌లను కూడా తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

















