- అంబేద్కర్ చూపిన బాటలోనే దళిత సంక్షేమం సాధ్యం
- దళితుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది.
- దళితుల జీవితాల్లో మార్పు కోసమే దళితబంధు పథకం
- 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం తెలంగాణ గర్వకారణం
- అంబేద్కర్ విగ్రహ ప్రాంగణానికి తాళాలు వేయడం ప్రజల మనోభావాలపై దెబ్బ
- ప్రజల ఒత్తిడితోనే అంబేద్కర్ విగ్రహ ప్రాంగణం తెరిచారు
- విగ్రహాలు ప్రతిష్టించడమే కాదు..మహనీయుల ఆశయాలను ఆచరించాలి
- అంబేద్కర్ విగ్రహాలను చూసి పాలకులు ప్రజా సంక్షేమాన్ని గుర్తుంచుకోవాలి
- అంబేద్కర్ ఆశయాల సాధనే సమసమాజ నిర్మాణానికి పునాది
జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
కొమురవెల్లి:
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం రాంసాగర్ గ్రామంలో నూతనం గా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్స వంలో(At the grand ceremony of the Ambedkar statue installation)మంగళవారం ఆయన ముఖ్య అతి థిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముందు గా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించా రు. అనంతరం గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సభలో ఆయ న మాట్లాడారు.
ఎమ్మెల్యే పల్లా పాయింట్స్:
- గ్రామంలో ఎంతో అద్భుతంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పా టు చేసిన కమిటీ సభ్యులను, సర్పంచ్, ఉపసర్పంచ్ మరియు దళిత నాయకులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.
- మనం విగ్రహాలు కేవలం ప్రతిష్టించుకోవడానికే కాదు..ఆ విగ్రహాన్ని ఎందుకు పెట్టుకున్నాం..ఆ మహనీయుడు ఎవరు, మనం ఎందుకు వారిని గౌరవిస్తున్నాం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఆయన అందించిన రాజ్యాంగాన్ని, ఆశయాలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- అంబేద్కర్ అంటే కేవలం రిజర్వేషన్లు మాత్రమే కాదు. దేశం లోని ప్రతి పౌరుడికి కులమతాలకు అతీతంగా సమాన హక్కును, ఒకే వ్యక్తి ఒకే ఓటు విధానాన్ని అందించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.
- సమాజంలో ఎక్కడికి వెళ్లినా నేటికీ అత్యంత పేదరికంలో మగ్గు తోంది దళితులేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
- గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని, అమర వీరుల చిహ్నాలను చూస్తూ పాలకులు నిరంతరం ప్రజా సంక్షేమం వైపు అడుగులు వేయాలని, ప్రజలు వారి నుండి నిత్యం స్ఫూర్తి పొందాలని ఆకాంక్షించారు.
- గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితబంధు పథకాన్ని వంద శాతం పూర్తి స్థాయిలో లబ్ధిదారులందరికీ అందించలేకపో యాం.
- గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 50 వేల నుండి 2లక్షల రూపాయల వరకు రుణాలు ఇచ్చేవారు. అయితే ఆ లోన్ల కోసం తిరగడానికి, ఆఫీసుల చుట్టూ ఖర్చులకే సగం డబ్బు లు అయిపోయి దళితులకు చివరికి ఏమీ మిగి లేది కాదని గుర్తుచేశారు.
- దళిత కుటుంబాల జీవితాల్లో నిజమైన మార్పు రావాలనే ఆలోచనతోనే కేసీఆర్ ఎలాంటి బ్యాంకు లింకేజీ లేకుండా నేరుగా 10 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించే దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారు.
- అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే కేసీఆర్ ప్రభుత్వం దళితుల సంక్షేమానికి ఎంతో కృషి చేసింది.
- తక్కువ ఖర్చుతో ఎంతో అద్భుతంగా తెలంగాణ నూతన సచివాల యాన్ని నిర్మించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
- ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ గడ్డపై ఏర్పాటు చేశామని చెప్పారు.
- కానీ ఆ విగ్రహ ప్రాంగణానికి తాళాలు వేసి, ఆనవాళ్లు తొల గించాలని చూడటం ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీయడమేనని విమర్శించారు. చివరకు ప్రజల నుండి వచ్చి న తీవ్ర ఒత్తిడి కారణంగానే పాలకులు మళ్లీ వాటిని తెరవా ల్సి వచ్చిందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

















