12.5 C
London
Saturday, June 13, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ అర్హులకే పారదర్శకంగా దుకాణాల కేటాయింపు చేయాలి

అర్హులకే పారదర్శకంగా దుకాణాల కేటాయింపు చేయాలి

0
  • మొక్కజొన్న కొనుగోళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది 
  • మూడేళ్ల తర్వాత దుకాణాల సముదాయం పూర్తి అయింది
  • బస్తాల కొరత, కూలీల సమస్య తీవ్రంగా ఉంది 
  • రేపు ఉదయానికే బస్తాలు అందిస్తామని అధికారులు హామీ 
  • చేర్యాల వ్యవసాయ మార్కెట్‌లో 20 దుకాణాల సముదాయం ప్రారంభం
  • ముఖ్య అతిథిగా పాల్గొన్న జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

చేర్యాల : మార్కెట్లో  దుకాణాల కేటాయింపును అర్హులకే పారద  ర్శకంగా చేపట్టాలని మార్కెట్ అధికారులకు జన గామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సూచించారు. గురు వారం చేర్యాల వ్యవసాయ మార్కెట్‌లో(Cheryal Vyava  saya Market )నిర్మించిన 20 దుకాణాల సముదాయాన్ని జన గామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని దుకాణా లను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు.

మూడేళ్ల క్రితం ప్రారంభమైన పనులు పూర్తవడం ఆనందంగా ఉంది:

మూడు సంవత్సరాల క్రితమే ఈ షాపుల నిర్మాణం ప్రారంభ మైనప్పటికీ వివిధ కారణాలతో ఆలస్యమైంది. అనేక అవరో ధాలను దాటి ఇప్పుడు దుకాణాల సముదాయం పూర్తవ డం సంతోషకరమని రైతులు, వ్యాపారులకు ఇది ఉపయో  గపడుతుందని ఎమ్మెల్యే పల్లా అన్నారు.

పారదర్శకంగా దుకాణాల కేటాయింపు చేయాలి:

దుకాణాల కేటాయింపును పూర్తిగా పారదర్శకంగా నిర్వ హించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. రాజకీ యాలకు అతీతంగా, ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా అర్హులైన వారికే నిబంధనల ప్రకారం దుకాణాలు కేటాయిం చాలని స్పష్టం చేశారు. వడ్ల కొనుగోళ్లపై రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి రైతుల సమస్యలపై ఎమ్మెల్యే స్పందించి మాట్లాడారు. వడ్ల కొనుగోలు విషయంలో పలు ఫిర్యాదులు వస్తు న్నాయని తెలిపారు. బస్తాలు అందడం లేదని, వడ్లు కొనుగోలు జరగ డం లేదని రైతులు తన దృష్టి  కి తీసుకొచ్చారని చెప్పారు. ఈ విషయమై అధికారులతో మాట్లాడగా రేపు ఉదయానికే బస్తాలు అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోళ్లలో ఇదే పరిస్థితి:

మార్కెట్‌లో మొక్కజొన్న కొనుగోళ్లలో అనేక సమస్యలు ఎదురవుతు న్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసా  గుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నర్మెట, తరిగొప్పుల ప్రాంతాల్లో భారీగా పంట వచ్చినప్పటికీ అక్కడ మార్క్‌ఫెడ్ కేంద్రాలు ఏర్పాటు కాలేదని పేర్కొన్నారు. మార్క్‌ఫెడ్ కేంద్రా  లు ఏర్పాటు చేస్తే రైతులు దూర ప్రాంతాలకు వెళ్లి ఒక్కొక్క  రు రూ.8వేల వరకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు.

బస్తాల కొరత, కూలీల సమస్య తీవ్రంగా ఉంది:

ప్రస్తుతం మార్కెట్‌లో బస్తాల కొరతతో పాటు కూలీల సమస్య తీవ్రంగా ఉందని రైతులు తమ దృష్టికి తీసుకువ  చ్చారు. మరికొందరు రైతులు కూడా 20 రోజులుగా ఇబ్బం  దులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రధానంగా బస్తాల కొరత, ధాన్యం దించేందుకు కూలీల సమస్య తీవ్రం గా ఉందని పేర్కొన్నారు. ఈ సమస్యలపై కలెక్టర్‌తో పాటు మార్క్‌ఫెడ్ ఎండీతో మాట్లాడినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన అధికారులు రేపు ఉదయానికే అవసరమైన బస్తాలు అందిస్తామని హామీ ఇచ్చారు. నాలుగు లారీల ధాన్యం ఈరోజే ఎత్తుతామని అధికా రులు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే చెప్పారు. ప్రస్తుతం దాదాపు 15 లారీలు సిద్ధంగా ఉన్నాయని, సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వారం రోజులుగా వడ్లకు బస్తా లు అందడం లేదని ఆందోళన చెందుతున్న రైతులకు రేపు ఉదయానికే బస్తాలు అందేలా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే తానే అక్కడే ఉండి సమస్యను పరిష్కరిస్తా  నని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here