18 C
London
Monday, August 31, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ పాలిటెక్నిక్ వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దు

పాలిటెక్నిక్ వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దు

0
  • విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు
  • పేద విద్యార్థులపై ఫీజుల భారం మోపొద్దు
  • జీవో 97ను వెంటనే రద్దు చేయాలి
  • హరీశ్‌రావును వెంటనే విడుదల చేయాలి
  • విద్యార్థుల పక్షాన పోరాటం ఆపేది లేదు
  • సెప్టెంబర్ 7లోగా జీవో 97ను వెనక్కి తీసుకోవాలి
  • లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమం
  • సుబేదారి పోలీస్ స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బైఠాయింపు

హన్మకొండ:

మాజీ మంత్రి వర్యులు హరీశ్‌రావు అరెస్టు నేపథ్యంలో(In the wake of the arrest of former minister Varyu lu Harish Rao) జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గురువారం హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్‌ఎస్ నాయకు లు, కార్యకర్తలతో కలిసి బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరే కంగా నినాదాలు చేశారు. హరీశ్‌రావును వెంటనే విడుదల చేయాలని, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను పరిష్క రించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి  మాట్లా డుతూ..

  • పాలిటెక్నిక్ విద్యార్థులు, తల్లిదండ్రుల న్యాయమైన డిమాం డ్లకు మద్దతుగా నిలిచిన హరీశ్‌రావును అరెస్ట్ చేయడం ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి నిదర్శనమన్నారు.
  • విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం పోలీసులతో ఉద్యమాన్ని అణచివేయాలని చూడటం సరికాదన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల పక్షాన నిలిచిన బీఆర్‌ఎస్ నాయకులను, తల్లిదండ్రులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
  • జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేసి, పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లే విలీన ప్రతిపాదనను ఉపసం హరించుకోవాలని డిమాండ్ చేశారు.
  • పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పేద, గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నారు.
  • ఎస్‌బీటీఈటీ పరిధిలో తక్కువ ఫీజులతో సాంకేతిక విద్యను అభ్య సిస్తున్న పేద విద్యార్థులపై ప్రైవేట్ భాగస్వామ్య విధానంతో అధిక ఫీజుల భారం మోపడం సరికాదన్నారు.
  • పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు ఈసీఈటీ ద్వారా బీటెక్‌లో సెకండ్ ఇయర్ లాటరల్ ఎంట్రీ అవకా శాన్ని కొనసాగించాలని కోరారు. లాటరల్ ఎంట్రీని నిలిపి వేయడం వల్ల వేలాది మంది విద్యా ర్థుల ఉన్నత విద్యావకాశాలు దెబ్బతింటాయన్నారు.
  • రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల భూములు, ఆస్తులపై ప్రభుత్వం కన్నేయడం సరికాదన్నారు. ఎస్‌ బీటీఈటీ స్వయంప్రతిపత్తిని కాపాడుతూ, పాలిటెక్నిక్ డిప్లొమా విద్యకు ఉన్న ప్రత్యేకతను కొనసాగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనలను పోలీసులతో అణ చివేయకుండా వారి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలని సూచించారు.
  •  సెప్టెంబర్ 7న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా జీవో 97ను వెనక్కి తీసుకోవాలి. లేకపోతే విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.
  • అవసరమైతే సచివాలయం ముట్టడితో పాటు లక్షలాది మంది విద్యార్థులతో రాష్ట్రవ్యాప్త ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు బీఆర్‌ఎస్ పోరాటం ఆపదని పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు తేల్చిచెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here