18 C
London
Monday, August 31, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ రజాకార్ల రాక్షసత్వాన్ని ఎదిరించిన వీర బైరాన్‌పల్లి..!

రజాకార్ల రాక్షసత్వాన్ని ఎదిరించిన వీర బైరాన్‌పల్లి..!

0
  •  125 మంది అమరవీరుల త్యాగం.. తరతరాలకు పోరాట స్ఫూర్తి
  •  బైరాన్‌పల్లి చరిత్రను భావితరాలకు చాటిచెప్పాలి
  •  వీర బైరాన్‌పల్లిని చారిత్రక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి
  •  బైరాన్‌పల్లి కాదు.. వీర బైరాన్‌పల్లిగా పేరు మార్చాలి
  • వీరుల త్యాగం వృథా కాదు.. బైరాన్‌పల్లి అభివృద్ధికి కృషి చేస్తా
  • వీర బైరాన్‌పల్లి చరిత్ర దేశంలోని ప్రతి విద్యార్థికి తెలియాలి
  • అమరవీరుల కుటుంబాలకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా పోరాడతా
  • -ఆరు నెలల్లో అభివృద్ధి పనులకు మంజూర్లు చేయిస్తా
  • వీర బైరాన్‌పల్లి అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి 

బైరాన్‌పల్లి:

తెలంగాణ చరిత్రలో చెరగని ముద్ర వేసిన వీర బైరాన్‌పల్లి అమరవీరులస్మరణ దినం(Commemoration Day of the Veera Bairanpally Martyrs)సందర్భంగా జనగా మ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గురువారం బైరాన్‌ పల్లిలో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో పాల్గొని అమరవీ రులకు ఘనంగా నివాళులర్పించారు. 1948 ఆగస్టు 27న రజాకార్ల దుశ్చ ర్యలకు బలై ప్రాణత్యాగం చేసిన 125 మంది వీరులకు, వారి కుటుంబ సభ్యులకు శిరస్సు వంచి జోహార్లు అర్పించారు.

అనంతరం నాటి అమరవీరుల కుటుంబ సభ్యులను, తెలం గాణ సాయుధ పోరాట ఉద్యమంలో పాల్గొన్న వారిని, ప్రత్యే క పాత్ర పోషించిన ప్రముఖులను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఘనంగా సన్మానించారు. బైరాన్‌పల్లి పోరాట చరిత్రను వెలికితీసి, అనేక విషయాలను సేకరించి పుస్తక రూపంలో అందించిన డాక్టర్ చందా రామయ్యను కూడా ఎమ్మెల్యే ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..

  • ఆయుధాలు కలిగిన నిజాం సైన్యాలను సైతం ఎలాంటి ఆధునిక ఆయుధాలు లేకుండా కారం పొడి, కట్టెలు, సొంతంగా తయారు చేసుకున్న మందుగుండుతో బైరాన్‌ పల్లి ప్రజలు ధైర్యంగా ఎదుర్కొన్నారని కొనియాడారు.
  • రజాకార్ల దాడులను నాలుగు సార్లు తిప్పికొట్టిన అనంతరం భారీ సంఖ్యలో వచ్చిన సైన్యం గ్రామంపై దాడి చేసి మారణ కాండకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
  • బైరాన్‌పల్లి పోరాటం ఒక్క గ్రామానికి పరిమితమైనది కాద ని, మద్దూరు, లింగాపూర్, కూటికల్, బెక్కల్, దూల్మెట తదితర చుట్టు పక్కల గ్రామాల ప్రజలను రజాకార్ల దాడుల నుంచి రక్షించడంలో బైరాన్‌పల్లి యువకులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. గ్రామ బురుజును రక్షణ కేంద్రంగా ఏర్పాటు చేసుకుని అనేక గ్రామాల ప్రజలకు అండగా నిలి చిన వీరుల చరిత్రను కొనియాడారు.
  • చారిత్రక ప్రాధాన్యత కలిగిన బైరాన్‌పల్లి గ్రామానికి అధికారి కంగా వీర బైరాన్‌పల్లిగా పేరు మార్చాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు ఇప్పటికే వినతిపత్రం అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
  • ప్రభుత్వం నుంచి ఎలాంటి అదనపు ఖర్చు లేకుండానే చేయగలిగే పేరు మార్పు విషయంలో ఇంతకాలం ఎందుకు జాప్యం జరిగిందో అర్థం కావడం లేదన్నారు. ఈ విషయంలో మరోసారి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి పేరు మార్పు జరిగేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.
  • వీర బైరాన్‌పల్లి గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనుల న్నింటినీ రాబోయే ఆరు నెలల్లో మంజూరు చేయించేలా దగ్గరుండి పర్యవేక్షి స్తానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి  హామీ ఇచ్చారు.
  • గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా నన్నారు.
  • బైరాన్‌పల్లి చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన బురుజు ప్రస్తుతం శిథిలా వస్థకు చేరుకోవడం బాధాకరమన్నారు. ఈ బురు జును పునరుద్ధరించి స్మారక చిహ్నంగా, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కోరినట్లు తెలిపారు.
  •  ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికీ నాటి ప్రజల పోరాటం, త్యాగం, ధైర్య సాహసాలు స్ఫూర్తినిచ్చేలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
  •  తెలంగాణ జలియన్‌వాలాబాగ్‌గా చరిత్రలో నిలిచిన బైరాన్‌పల్లి పోరాట గాథను భవిష్యత్ తరాలు తెలుసు కునేలా తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పాఠశాల పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
  •  ఈ చరిత్ర ఒక్క బైరాన్‌పల్లి ప్రజలదో, తెలంగాణ ప్రజలదో కాదని.. అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే ప్రపంచంలోని ప్రజలందరికీ స్ఫూర్తినిచ్చే చరిత్ర అని పేర్కొన్నారు.
  • నాటి పోరాటంలో త్యాగాలు చేసిన అమరవీరుల కుటుం బాలకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబాల వారసు లకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం, గౌరవం అందేలా పోరాడుతానని హామీ ఇచ్చారు.
  • తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వెలుగులోకి తీసుకురా వడానికి పుస్తకాలు, వ్యాసాలు రాస్తూ, తెలంగాణ అంతటా తిరిగి సమాచారాన్ని సేకరించిన డాక్టర్ చందా రామయ్య గారి సేవలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.
  •  నేటి 15, 20, 30 ఏళ్ల యువతకు వీర బైరాన్‌పల్లి చరిత్ర, అమర వీరుల త్యాగాలు పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉంది.
  • బైపాస్ సర్జరీ అనంతరం కూడా రామయ్య గారు వెనుక డుగు వేయ కుండా బైరాన్‌పల్లి గ్రామంలోని ప్రతి వార్డులో పర్యటించి, ప్రజల అభి ప్రాయాలు తెలుసుకుని, నాటి అమరవీరుల కుటుంబాలను కలిసి వివరాలను సేకరిం చారు..
  • నాటి సంఘటనలు కేవలం కథలుగా మిగిలిపోకుండా, పుస్తకాలు మరియు ఇతర రూపాల్లో భవిష్యత్ తరాలకు అందించాలి.
  • సుమారు 4,000 మంది అమరులైన తెలంగాణ సాయుధ పోరా టంలో బైరాన్‌పల్లి త్యాగం ప్రత్యేకమైనదని, ఈ ప్రాంతం ఉద్యమానికి గొప్ప స్ఫూర్తిగా నిలిచిందన్నారు.
  • తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొము రయ్య, పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ వంటి మహనీయుల త్యాగాలతో జనగామ ప్రాంతానికి ప్రత్యేక చారిత్రక ప్రాధాన్యత ఉందన్నారు.
  • గ్రామ ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను చిన్నవైనా, పెద్దవైనా పరిష్కరించేందుకు కచ్చితంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
  • ప్రభుత్వంలో ఉంటే ఆరు నెలల్లోనే పూర్తి చేసేవాడిని. ప్రస్తుతం ప్రభుత్వం తమ చేతుల్లో లేకపోయినా ప్రజల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని, భవిష్యత్‌లో అవకాశం వచ్చినప్పుడు ఆరు నెలల్లోనే అభివృద్ధి పనులను పూర్తి చేసి చూపిస్తాను.
  • బైరాన్‌పల్లి మట్టి వందలాది మంది అమరుల రక్తంతో తడిసిన పవిత్ర గడ్డ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ నేలపై అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిలో పోరాట స్ఫూర్తి, ధైర్యం, ఉత్సా హం రగిలేలా వీర బైరాన్‌పల్లి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here