- గ్రామీణ విద్యార్థులకు పట్టణ స్థాయి సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో పని చేశాం
- కొమురవెల్లి కేజీబీవీలో ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన
- ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
కొమురవెల్లి:
కొమురవెల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)పాఠశాలలో నాబార్డ్ గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి పథకం కింద రూ.42.13 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన ప్రహరీ గోడకు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి సోమవారం శంకు స్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థినుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని కేజీబీవీ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధు లు మంజూరు చేసి విద్యారంగాన్ని బలోపేతం చేశామని అన్నారు.
బాలికలు సురక్షిత వాతావరణంలో విద్యాభ్యాసం కొనసా గించేందుకు ఇటువంటి అభివృద్ధి పనులు ఎంతో ఉపయోగ పడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పట్టణ స్థాయి సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో బీఆర్ ఎస్ ప్రభుత్వం పనిచేసిందన్నారు. అభివృద్ధి పనులు ప్రజల కు ఉపయోగపడేలా ఉండాలని, విద్యారంగం బలోపేతం కావడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.

















